Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా రైళ్ల స్పీడ్​ 160 కి.మీ : సౌత్ సెంట్రల్ జీఎం

Webdunia
ఆదివారం, 1 డిశెంబరు 2019 (12:33 IST)
దేశవ్యాప్తంగా రైళ్ల వేగం 130 నుంచి 160 కిలో మీటర్లకు పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్​ మాల్యా తెలిపారు. 2022 వరకు కాజీపేట, బల్లార్ష జంక్షన్ల మధ్య మూడో రైల్వే లైన్​ పనులు పూర్తి చేస్తామన్నారు. మనోహరాబాద్​, నిజామాబాద్​ మీదుగా పెద్దపల్లి వరకు రైల్వే లైన్​ను ఆయన పరిశీలించారు. 
 
రెండున్నరేళ్ల క్రితం పూర్తయిన నిజామాబాద్ - పెద్దపల్లి రైల్వే లైన్​ పనులు పరిశీలించి సంతృప్తిగా ఉన్నాయని అన్నారు. కొత్త రైలు మార్గంలో రైళ్ల వేగం 50 నుంచి 70 కిలో మీటర్లకు పెంచడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 
 
ప్రస్తుతం పెద్దపల్లి నుంచి జగిత్యాలలోని లింగంపల్లి వరకు రైల్వే లైన్​ఎలక్ట్రికల్​ పనులు పూర్తయ్యాయని చెప్పారు. లింగంపల్లి నుంచి నిజామాబాద్​ వరకు ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. పెద్దపల్లి-నిజామాబాద్​మార్గంలో లింగంపల్లి, కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లిలో గూడ్స్​షెడ్లు నిర్మించాలని డిమాండ్​ ఉందని, వీటిని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 
 
న్యూఢిల్లీ నుంచి చైన్నయ్​ వరకు, ఢిల్లీ నుంచి ముంబై, ఢిల్లీ నుంచి కలకత్తా, కలకత్తా నుంచి చైన్నయ్​, చైన్నయ్​ నుంచి ముంబై మార్గాల్లో రైళ్ల వేగం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మొదట 130 కిలో మీటర్లకు తర్వాత 160 కిలో మీటర్లకు వేగం పెంచాలని భావిస్తున్నామని తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో ఈ రూట్లలో ఉన్న అన్ని లెవల్​ క్రాసింగ్​లను మూసి వేస్తామని, పాలసీ నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని అన్నారు.  సికింద్రాబాద్​ నుంచి తిరుపతి, షిర్డీ రైళ్ల కోసం డిమాండ్​ఉందని, కొత్త రైళ్లు నడిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. 

సంబంధిత వార్తలు

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి ల రిసెప్షన్

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments