Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది పట్టుకున్నప్పుడు నువ్వు చూశావా? డిప్యూటీ సిఎంను ప్రశ్నించిన రఘురామకృష్ణ రాజు

Webdunia
ఆదివారం, 16 ఆగస్టు 2020 (14:54 IST)
రఘురామక్రిష్ణరాజుకు కోపమొస్తోంది. ఆయన రోజుకో విధంగా ప్రభుత్వంపై విమర్సలు చేస్తున్నారు. వైసిపి గుర్తుతో గెలిచిన రఘురామక్రిష్ణరాజు ప్రస్తుతం ఆ పార్టీ నేతలపైనే విమర్సలు చేస్తూ హాట్ టాపిక్‌గా మారుతున్నారు. తన నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతో పాటు తనను విమర్సించే వారెవరినీ వదిలిపెట్టడం లేదు ఆ ఎంపి.
 
బిజెపితో పాటు టిడిపి ముఖ్య నాయకుల కనుసన్నల్లోనే రఘురామక్రిష్ణరాజు పనిచేస్తున్నారని, వారు చెప్పినట్లే అధికార పార్టీపై లేనిపోని విమర్సలు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా ఎంపి రఘురామక్రిష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
అది కూడా ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిని ఏకిపారేశారు. నిన్న ఎంపిపై ఉపముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. జగన్ కాళ్ళు పట్టుకుని ఎంపి టిక్కెట్టు తెచ్చుకున్నారు రఘురామక్రిష్ణమరాజు. ఆయన ఎవరో కూడా జనానికి తెలియదు. 
 
మా పార్టీ గుర్తుతో గెలిచిన వ్యక్తి రఘురామక్రిష్ణరాజు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎంపి పదవికి రాజీనామా చేయాలన్నారు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి. దీంతో ఎంపికి కోపమొచ్చింది. ప్రెస్‌మీట్ పెట్టి డిప్యూటీ సిఎంను ఏకిపారేశారు. జగన్ కాళ్ళు పట్టుకున్నప్పుడు నువ్వు చూశావా అంటూ ప్రశ్నించారు.
 
నోటికి ఎంత వస్తే అంత మాట్లాడొద్దు డిప్యూటీ సిఎం, ముందు భజన చేయడం మానుకో, ఎవరు ఎంతటి వారో అందరికీ తెలుసు. నాపై మరోసారి విమర్సలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. డిప్యూటీ సిఎం, ఎంపి రఘురామక్రిష్ణరాజుల మధ్య జరిగిన మాటలయుద్ధం రాజకీయ చర్చకు దారితీస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments