Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్ సినిమా చూశాను... కళ్లు చెదిరిపోయాయి.. ఆర్ఆర్ఆర్

Webdunia
ఆదివారం, 27 మార్చి 2022 (15:08 IST)
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం "ఆర్ఆర్ఆర్". జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు నటించగా, డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రాన్ని సాధారణ ప్రేక్షకుల మొదలుకుని సెలెబ్రిటీల వరకు థియేటర్లకు వెళ్లి చూస్తున్నారు. ఇలాంటివారిలో వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు (ఆర్ఆర్ఆర్) కూడా ఉన్నారు. 
 
ఈయన ఈ చిత్రాన్ని చూసిన తర్వాత తన స్పందనను తెలిపారు. "ఆర్ఆర్ఆర్ సినిమాను చూశాను. కళ్లు చెదిరిపోయాయంటే అతిశయోక్తి కాదు. భీమ్ పాత్రలో ఎన్టీఆర్, రామ్ చరణ్ అద్భుతమైన నటన కనబరిచారు. వెండితెరపై కథలు చెప్పడంలో తనకు తిరుగులేదని రాజమౌళి మరోమారు నిరూపించుకున్నారు. ఇంటి భారీ విజయాన్ని సాధించిన యావత్ చిత్ర బృందానికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను" అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments