Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.. అమ్మ ఒడి అన్నారు.. నాన్న బుడ్డీ పెట్టారు..

Webdunia
శనివారం, 28 మే 2022 (11:45 IST)
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహానాడు వేదికగా వైఎస్సార్ సర్కారుపై ఫైర్ అయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరుగుతున్న టీడీపీ వార్షిక వేడుక మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ సర్వనాశనమైందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలకు చంద్రబాబు సమరశంఖం పూరించారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలకు కొత్త నినాదం ఇచ్చారు. "క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ (జగన్‌ను వదిలించుకుందాం.. ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకుందాం) అని చంద్రబాబు నినాదం ఇచ్చారు. ఈ నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇక, వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. 
 
రాష్ట్రంలో ఏ రైతు ఆనందంగా లేరని.. దిక్కుతోచని పరిస్థితుల్లో రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఏ రైతు అయినా ఆనందంగా ఉన్నాడా అని ప్రశ్నించారు. అమ్మ ఒడి అన్నారు.. నాన్న బుడ్డీ పెట్టారని ఎద్దేవా చేశారు. రైతులకు మళ్లీ మంచి రోజులు వస్తాయని చెప్పారు.  
 
మహానాడు అంటే తెలుగు జాతికి పండుగ అని పేర్కొన్నారు. చరిత్ర ఉన్నంత వరకూ టీడీపీ ఉంటుందని.. పసుపు రంగు చూస్తేనే చైతన్యం వస్తుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

ట్విట్టర్-ఫేస్ బుక్ పేజీలను క్లోజ్ చేసిన రేణూ దేశాయ్, టార్చర్ పెడుతున్నది పవన్ ఫ్యాన్స్ కాదా?

హైదరాబాద్‌లో తమన్నా భాటియా ఓదెల 2 కీలకమైన యాక్షన్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments