Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త, కొడుకును వదిలి వచ్చిన డాన్సర్.. బార్ కొచ్చిన యువకుడితో సహజీవనం... చివరకు...

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2018 (11:32 IST)
మనస్పర్థలు కారణంగా కట్టుకున్న భర్తను, కన్నబిడ్డను వదిలి వచ్చిన ఓ డాన్సర్ కథ విషాదంగా ముగిసింది. నమ్మించి ప్రేమించి సహజీవనం చేసిన యువకుడే ఆమె ప్రాణాలు బలితీశాడు. హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన బార్ డాన్సర్ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే...
 
పంజాబ్‌కు చెందిన సానియా బేగం అనే యువతికి పెళ్లయి భర్తతో పాటు కుమారుడు ఉన్నాడు. భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా హైదరాబాద్‌కు వచ్చేసింది. ఇక్కడే ఓ బార్‌లో డాన్సర్‌గా పనిచేస్తోంది. పబ్‌లో పరిచయమైన షేక్‌ సల్మాన్‌ అనే యువకుడి ప్రేమలో పడి నాలుగేళ్లుగా అతడితో సహజీవనం చేస్తోంది. 
 
కానీ, అతడేమో కొన్నాళ్లుగా ఆమె ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. ఇతరులతో ఆమె చనువుగా మాట్లాడుతోందని లోలోపల రగిలిపోయాడు. దీంతో ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు. ఇంట్లోనే ఆమెను చేతులు కట్టేసి.. గొంతు నులిమి హత్య చేశాడు. 
 
మృతదేహంపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి పారిపోయాడు. ఇంటి నుంచి దట్టమైన పొగ రావడంతో ఇరుగుపొరుగువారు గమనించి పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని సగం కాలిపోయిన మృతదేహాన్ని స్వాధీనం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడు సల్మాన్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. సల్మాన్‌కు గతంలో నేర చరిత్ర ఉన్నట్లు తెలిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments