Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు పల్స్ పోలియో - తెలుగు రాష్ట్రాల్లో విస్తృత ఏర్పాట్లు

Webdunia
ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (09:29 IST)
దేశ వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుక్ మాండవీయ ఢిల్లీలో ప్రారంభించారు. ఆదివారం దేశ వ్యాప్తంగా ప్రారంభమైంది. ఇందుకోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా తెలంగాణాలో 23,331 కేంద్రాలు ఏర్పాటు చేసి పోలియో చుక్కలు వేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా 38,31,907 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, మసీదులు, ప్రధాన కూడళ్ళలో పల్స్ పోలియో శిబిరాలను ఏర్పాటుచేశారు. 
 
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు.. సామాజిక కేంద్రాలు, ప్రాంతీయ ఆస్పత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు ఇతర ముఖ్య కూడళ్ళలో పల్స్ పోలియో చుక్కలను చిన్నారులకు వేయనున్నారు. 
 
ఆదివారం పంపిణీ చేయడంతో పాటు సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలను పంపిణీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. దేశాన్ని పోలియో రహిత దేశంగా మార్చే చర్యల్లో భాగంగా, ఐదేళ్ళలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments