Webdunia - Bharat's app for daily news and videos

Install App

'స్పా' ముసుగులో హైటెక్ వ్యభిచారం... సకల సౌకర్యాలతో సర్వీస్

Webdunia
శనివారం, 23 నవంబరు 2019 (13:32 IST)
విజయవాడ నగరంలో స్పా ముసుగులో హైటెక్ వ్యభిచారం కొనసాగిస్తూ వచ్చారు. పైగా, స్పా సెంటర్‌కు వచ్చే కస్టమర్లకు సకల సౌకర్యాలతో కూడిన లగ్జరీ హౌస్‌లో అందమైన అమ్మాయిలను చూపించి విటులను ఆకర్షిస్తూ ఈ వ్యభిచార గుట్టును రహస్యంగా సాగిస్తూ వచ్చారు. ఈ హైటెక్ వ్యభిచార గుట్టుపై పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఈ వ్యభిచార గుట్టును బహిర్గతం చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడ నగరంలో ఇటీవలి కాలంలో స్పా, మసాజ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఫలితంగా పోటీ పెరిగింది. అయితే, కొన్ని స్పా, మసాజ్ సెంటర్ల యజమానులు తమ కేంద్రాల్లో రహస్యంగా వ్యభిచారం చేయించసాగారు. 
 
ముఖ్యంగా, ఖరీదైన భవనాలను అద్దెకు తీసుకుని అందులో స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో హైటెక్ వ్యభిచారం నిర్వహించసాగారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో కొన్ని మసాజ్ సెంటర్లు, స్పాలపై దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో పలువురు అమ్మాయిలతో పాటు విటులను, నిర్వాహకులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. 
 
దీనిపై నగర పోలీస్ కమిషనర్  ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. స్పాల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో దాడులు నిర్వహించి పలువురిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఇటువంటి దందాలపై ఉక్కుపాదం మోపుతున్నామని, ఉపేక్షించబోమని సీపీ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments