Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ బాబూ ప్లీజ్... అంటూ దణ్ణం పెడుతున్న బండ్ల గణేష్.. ఎందుకు?

Webdunia
బుధవారం, 14 నవంబరు 2018 (18:47 IST)
బండ్ల గణేష్. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం నాయకుడిగా కొనసాగుతున్న వ్యక్తి. సినీ నిర్మాత కూడా. సినిమాల్లో చిన్నచిన్న క్యారెక్టర్లు వేసుకుని తిరుగుతున్న బండ్ల గణేష్‌ ఒక్కసారిగా నిర్మాతగా మారడం.. కొన్ని సినిమాలు తీయడం తెలుగు సినిమాలో అప్పట్లో చర్చకు దారితీసింది. ఎవరెన్ని మాట్లాడుకున్నా సినిమాలు తీయడం మాత్రం కొనసాగించారు బండ్ల గణేష్‌. నిర్మాతగా తెలుగు సినీపరిశ్రమలో బాగా నిలదొక్కుకున్నారు. 
 
సినీ పరిశ్రమలో గురువుగా భావించే పవన్ కళ్యాణ్‌‌తో సినిమా చేశారు బండ్ల గణేష్‌. అలాగే పలువురు యువ అగ్రనటులతో కూడా సినిమాలు చేసి సినీపరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న బండ్ల గణేష్‌, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
నేను అనుకున్న హీరోలతో సినిమాలు చేశాను. కొన్ని సినిమాలు బాగా ఆడాయి. మరికొన్ని ఫట్టయ్యాయి. అయినా ఫర్వాలేదు. కానీ పవన్ కళ్యాణ్‌‌తో సినిమా చేయాలన్న ఆలోచన ఇప్పటికీ ఉంది. ఒక భారీ బడ్జెట్ సినిమా చేయాలనుకుంటున్నారు. కళ్యాణ్‌ బాబు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.. ఆయనెక్కడ సినిమాల్లో నటిస్తారు. ఇంకా నటించరనుకుంటా. నాకైతే చాలా బాధగా ఉంది. పవన్ మళ్ళీ సినిమాల్లోకి రావాలని కోరుకుంటున్నా. కళ్యాణ్‌ బాబు ప్లీజ్ సినిమాల్లోకి రండంటూ రెండు చేతులు జోడించి దణ్ణం పెడుతున్నాడు బండ్ల గణేష్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments