Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు... సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు వార్నింగ్

ఠాగూర్
గురువారం, 23 మే 2024 (11:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. దీనిపై ప్రభుత్వం కన్నెర్రజేసింది. ఈ సేవలు అందించే సూపర్ స్పెషాలిటీ, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యంపై కన్నెర్రచేసింది. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అంతరాయం కలిగిస్తే అలాంటి ఆసుపత్రులపై చర్యలు తప్పవని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ సేవలు బ్రేక్ కాకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. 
 
పెండింగ్ నిధులపై పట్టుబడుతూ ఆరోగ్యశ్రీ సేవలకు కొన్నిచోట్ల నెట్ వర్క్ ఆసుపత్రులు బ్రేక్ వేశాయన్నారు. 2023-24లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి రూ.3,556 కోట్లు నెట్ వర్క్ ఆసుపత్రులకు జమ చేసినట్లు తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం రూ.203 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. 2024-25 మొదటి రెండు నెలల్లో ఇప్పటి వరకు రూ.366 కోట్లు విడుదల చేశామన్నారు. మిగతా బకాయిలు త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
 
కాగా, ముందుగా ఇచ్చిన నోటీసుల మేరకు బుధవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయి. పలుచోట్ల రోగులను చేర్చుకోవడానికి ఆసుపత్రులు నిరాకరించాయి. బిల్లులు చెల్లించడం లేదంటూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో... ఆసుపత్రుల యజమాన్యాల సంఘాన్ని ట్రస్ట్ సీఈవో చర్చలకు ఆహ్వానించారు. అయితే ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు జరిగిన చర్చలు ఫలించలేదు. దీంతో ఈరోజు నుంచి ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయి.
 
మరోవైపు, ఆరోగ్యశ్రీ సీఈవో మాట్లాడుతూ, మంగళవారం చర్చల అనంతరం, నెట్‌వర్క్ ఆసుపత్రులకు రూ.203 కోట్ల విడుదల చేసినట్లు వెల్లడించారు. పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. ఆరోగ్యశ్రీ సేవలకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించినట్లు ట్రస్ట్ వెల్లడించింది. కానీ మొత్తం నిధులు విడుదల చేయాలని ఆసుపత్రులు స్పష్టం చేశాయి. దీంతో బుధవారంమరోసారి చర్చలు జరిగాయి. చర్చలు విఫలం కావడంతో బుధవారం నుంచి తమ అసోసియేషన్‌లో సభ్యత్వం కలిగిన ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించడాన్ని నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments