2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమిని ముందే ఊహించిన ప్రశాంత్ కిషోర్ ఢిల్లీలో నారా లోకేష్‌తో సమావేశమయ్యారు. ఎన్నికల ముందు టీడీపీకి వ్యూహాలు.. సూచనలు అందించిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు ఏపీలో పరిస్థితుల పైన ఇచ్చిన గ్రౌండ్ రిపోర్ట్ లో కీలక అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం.
మొదట రాజకీయ విశ్లేషకుడైన ప్రశాంత్ కిషోర్ ఒక సమయంలో వైసీపీతో కూడా పనిచేశారు. ఇప్పుడు ఆయన విశ్లేషకుడే కాకుండా బీహార్‌లో జాన్ సురాజ్ అనే పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు.
తన సొంత ఎజెండాతో రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్, లోకేష్‌ను కలవడం సంచలనం సృష్టించింది. ఈ సమావేశం ఇప్పటివరకు ఎటువంటి నిర్దిష్ట సమాచారం వెలువడలేదు. అయితే, బిజెపి తరపున ప్రచారం చేయడానికి చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారని గమనించాలి. కానీ కిషోర్ లోకేష్‌ను కలవడం వెనుక వున్న సంగతేంటి అనేది తెలియాల్సి వుంది.