తెలుగువాడిని కాదంటూ... ప్ర‌కాష్ రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (11:57 IST)
నేను తెలుగు వాడిని కాదు అంటూ... క‌న్నీళ్ళ‌తో న‌టుడు ప్ర‌కాష్ రాజ్ మా స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. ఇది బాధతో తీసుకున్న నిర్ణయం కాదు, తెలుగు వారు మాత్రమే మా అధ్యక్షుడిగా ఉండాలని అన్నారు, అలానే చేశారు. ప్రాంతీయత ఆధారంగా మా ఎన్నిక జ‌రిగింద‌ని ప్ర‌కాష్ రాజ్ ఆరోపించారు. 
 
నేను తెలుగు వాడిని కాదు, నా తల్లిదండ్రులు తెలుగు వారు కాదు. అయినా తెలుగు పరిశ్రమలో 25 ఏళ్ల ప్రయాణం చేశా... అలానే పరిశ్రమలో కొనసాగుతా... నటిస్తూ ఉంటా...నేనొక అతిథిగా వచ్చాను, అతిధిగానే కొనసాగుతూ ఉంటా. ఇక మా సంస్థ‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విష్ణుకి హితవు చెపుతున్నా అని ప్ర‌కాష్ రాజ్ పేర్కొన్నారు. గెలిచిన ప్రతి అభ్యర్థికి శుభాకాంక్షలు తెలిపిన ప్రకాష్ రాజ్, ఇది తాను తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం కాద‌న్నారు. ఆలోచించి తీసుకున్న నిర్ణయం అని చెప్పుకొచ్చారు.
 
రాజకీయంగా కూడా త‌న‌ను లాగి ట్వీట్ తో విశ్లేషణ చేసినందుకు బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు బండి సంజాయ్ కి ధన్యవాదాలు చెపుతున్నా అని ప్ర‌కాష్ రాజ్ పేర్కొన్నారు. కంట తడి పెట్టుకుంటూ మా సభ్యత్వానికి రాజీనామా చేశారు ప్రకాష్ రాజ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments