మా ఎన్నికల అనంతరం మంచు ఫ్యామిలీ సినీ పరిశ్రమపై ఆధిపత్యాన్ని సంపాదించే యత్నంలో ఉన్నట్లు కనిపిస్తోంది. మోహన్ బాబు ఈ సందర్భంగా మా సభ్యులకు దాదాపు హుకుం జారీ చేశారు. మా పర్మిషన్ లేనిదే మీడియా ఎదుటికి ఏ సభ్యుడూ వెళ్ళ కూడదని ఆయన ఖరాఖండితంగా చెప్పారు.
మా సభ్యులంతా సంయమనం పాటించాలని మోహన్‌బాబు చెప్పారు. మా ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఆయన మాట్లాడారు. సభ్యులంతా సంయమనం పాటించాలని కోరారు. ప్యానల్‌లో గెలిచిన తర్వాతే బయటకు వెళ్లాలి. ఎవరూ ఓవరాక్షన్ చేయొద్దు. మేమే మీడియా ముందుకు వస్తాంఅని మోహన్‌బాబు తెలిపారు. ఇక్కడితో సరి కాదు... ముందు ముందు కూడా మీడియా ఎదుటికి వెళ్ళి పలుచన కావద్దని, ప్రతిదానికి మా పర్మిషన్ తీసుకోవాలన్నారు.
హోరాహోరీగా సాగిన మా ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందారు. మంచు కుటుంబానికే మా పీఠం దక్కింది. విమర్శలు, వివాదాలు నడుమ సాగిన ఎన్నికల్లో మొదటి నుంచి ఆధిక్యంలో ఉన్న ఆయన ప్రకాశ్‌రాజ్‌పై విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీగా మంచు విష్ణు ప్యానల్‌కు చెందిన గౌతమ్ రాజు విజయం సాధించగా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ అధిక ఓట్లతో గెలుపొందారు. వైస్ ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు టీమ్ నుంచి పృథ్వీ రాజ్ విజయం సాధించారు.