Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓరేయ్ జగన్.. దమ్ముంటి రారా : కె.ఏ.పాల్ సవాల్

Webdunia
ఆదివారం, 7 ఏప్రియల్ 2019 (13:08 IST)
వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డిపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ విమర్శలు దాడి చేశారు. పరుష పదజాలంతో దూషించారు. ఓరేయ్ జగన్.. దమ్ముంటి రారా అంటూ సవాల్ విసిరారు. నాతో డిబేట్‌కు రా. చేతకాని పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నావ్. నేడు జడుస్తాను అనుకుంటున్నావా? నేను ప్రపంచాన్ని జడిపించి ఇక్కడకు వచ్చాను. మా బీ-ఫారాలను దొంగలించడమేకాకుండా నా మీదే దాడి చేయిస్తావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
శనివారం అర్థరాత్రి వైసీపీ కార్యకర్తలు తనపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. భీమవరంలో తన హోటల్ గదిలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించారన్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన తాను గది తలుపు వేసేశానని చెప్పారు. దీంతో వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారన్నారు. గతంలో తనపై ఆనంద్.ఇన్ హోటల్‌లో దాడి చేసేందుకు ప్రయత్నించిన బ్యాచే ఇప్పుడు మరోసారి దాడికి ప్రయత్నించిందని ఆవేదన వ్యక్తంచేశారు. తనకు ప్రాణహాని ఉందన్నారు.
 
ఈ విషయాన్ని తనకు జెడ్‌ప్లస్ టికెట్ ఇవ్వాలని కోరితే అప్పటి ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఓ గన్‌మెన్ ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. శనివారం రాత్రి 12.45 నుంచి ఒంటి గంట మధ్యలో దాడి జరిగిందని కేఏ పాల్ తెలిపారు. ఈ సమయంలో తన భద్రతాసిబ్బంది వెళ్లిపోయారని చెప్పారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇంకా కేసు నమోదుచేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
మీ ఫ్యాన్స్ సార్.. అంటూ వీరంతా తన గదిలోకి వచ్చేందుకు ప్రయత్నించారని కేఏ పాల్ తెలిపారు. దీంతో 'రేపు ఉదయం 9.45 గంటలకు రండి.. మాట్లాడుకుందాం' అని సూచించానన్నారు. అంతలోనే వారు గదిలోకి దూసుకువచ్చేందుకు ప్రయత్నించడంతో వేగంగా తలుపు వేసేశానని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. జగన్ ఎన్నికల్లో గెలుపొందేందుకు చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments