Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల్లో వైకాపాకు చావుదెబ్బ... ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా!

ఠాగూర్
బుధవారం, 28 ఆగస్టు 2024 (17:40 IST)
గత మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైకాపాకు చావుదెబ్బ తగిలింది. ఈ ఓటమిని వైకాపా నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో అనేక మంది నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి టాటా చెప్పగా, ఇపుడు రాజ్యసభ సభ్యుడు, మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన మోపిదేవి వెంకట రమణ కూడా పార్టీని వీడినున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో వైకాపా ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత పార్టీకి రాజీనామా చేశారు. అలాగే, పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు శాసనమండలికి పంపించారు. 
 
కాగా, పోతుల సునీత ఏ పార్టీలో చేరేది తెలియరాలేదు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని ఆమె వెల్లడించారు. పోతుల సునీత వైకాపా రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్న విషయం తెల్సిందే. అలాంటి మహిళ నేత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
వైకాపా షాకివ్వనున్న మోపిదేవి వెంకటరమణ? 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న వైకాపా చిత్తుగా ఓడిపోయింది. వైకాపా బాపట్ల నియోజకవర్గం ఇన్‌‍చార్జిగా ఉన్న రాజ్యసభ సభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ఇపుడు టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఓ నిందితుడుగా ఉంటూ, కొన్ని నెలల పాటు జైలు జీవితం కూడా గడిపిన మోపిదేవి వెంకట రమణ ఇపుడు వైకాపా అధికారం కోల్పోవడంతో తాను పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
వైకాపా అధికారంలో కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. వీరిలో కొందరు రాజీనామా చేయగా, మరికొందరు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇటీవలే గుంటూరు నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కీలక నేతలు వైకాపాకు టాటా చెప్పేశారు. ఇపుడు మోపిదేవి వెంకట రమణ వంతు వచ్చినట్టుంది. ఆయన త్వరలోనే పార్టీని వీడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. జగన్‌కు అత్యంత సన్నిహితుడుగా, నమ్మిన బంటుగా ఉన్న మోపిదేవి... పార్టీని వీడనున్నారనే వార్తలతో పార్టీ శ్రేణులు షాక్‌కు గురవుతున్నాయి. ఆయన త్వరలో టీడీపీ గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 
 
వైసీపీలో అంతర్గత విభేదాల కారణంగానే సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం ఎంపీ మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేయనున్నారని సమాచారం. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా మోపిదేవి రాజీనామా చేస్తారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments