ఏపీలో వైసిపి తిరిగి అధికారంలోకి వస్తుందనీ, అప్పుడు పోలీసుల బట్టలు ఊడదీసి నడిరోడ్డుపై నిలబెడతానంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఒక్కొక్కరుగా పోలీసులు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. రాప్తాడు పర్యటనలో పోలీసుల బట్టలూడదీసి నిలబెడతానంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ కౌంటర్ ఎటాక్ చేసారు.
బట్టలు ఊడదీసి కొడతాను అంటున్నారు... అవేమైనా నువ్విస్తే వేసుకున్నవి అనుకున్నారా... మేము ఎంతో కష్టపడి ఎన్నో వేలమందితో పోటీపడి నెగ్గి, ఫిట్నెస్ పరీక్షల్లో పాసయ్యాక, ఎన్నో ఇంటర్వ్యూలలో సఫలమయ్యాక ఆ యూనిఫాంను మేము ధరించాము. మీరు ఏదో నోటికి వచ్చినట్లు బట్టలూడదీసి నిలబెడతాం అంటే అరటి తొక్క కాదు ఊడదీయడానికి. మేము ఏ నాయకుడికి, ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేయం. నిజాయితీకి మారుపేరు పోలీస్. మేం నిజాయితీగా వుంటాం, నిజాయితీగా చస్తాం. కాబట్టి పోలీసులను బట్టలు ఊడదీసి నిలబెడతాం అంటూ చేస్తున్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
మొత్తమ్మీద పోలీసులపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు కాస్తా మెల్లమెల్లగా బూమరాంగ్ లా మారి ఆయననే చుట్టుముడుతున్నట్లు కనిపిస్తోంది. మెల్లగా ఒక్కో పోలీసు అధికారి మాట్లాడుతున్నారు. ఒకేసారి అందరూ మూకుమ్మడిగా ఈ వ్యవహారంపై ఆందోళనకు దిగితే పరిస్థితి ఎలా వుంటుందో వేరే చెప్పక్కర్లేదు.
"జగన్.. నా బట్టలు ఊడదీస్తావా ? నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు కాదురా ఇవి.. కష్టపడి చదివి, పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫారం ఇది. ఎవడో వచ్చి ఊడదీయటానికి ఇది అరటి తొక్క కాదు.." pic.twitter.com/AnAppdFQEp