Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్‌కు మొదటిసారి చుక్కలు చూపించిన పోలీసులు...

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (21:54 IST)
నడి రోడ్డుపై బీటెక్ విద్యార్థినిని యువకుడు అతి దారుణంగా చంపేయడంతో ప్రతిపక్ష నేతలు రోడ్డెక్కారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరులో పర్యటిస్తూ ఆ యువతి ఇంటికి వెళ్లారు. దీంతో గంటల తరబడి ఆ ప్రాంతంలో హైడ్రామా నెలకొంది.
 
పోలీసులు లోకేష్‌ను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పత్తిపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా లోకేష్ ప్రవర్తించారంటూ కేసులు పోలీసులు పెట్టారు. ఆ తర్వాత ఆయనను పొన్నూరు తరలించారు. అక్కడ నుంచి గుంటూరుకు తరలించారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై నారా లోకేష్ మధ్యాహ్న భోజనం తీసుకునేందుకు నిరాకరించారు.
 
నారా లోకేష్‌తో పాటు వచ్చిన కొంతమంది నేతలను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. లోకేశ్‌పై 151 సీఆర్పీసీ కింద అభియోగాలు నమోదు చేశారు. పెదకాకాని పీఎస్‌‌లో నోటీసులపై సంతకం పెట్టించుకున్న తర్వాత లోకేశ్‌ను విడిచిపెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments