Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ వీడియోలో ఉన్నమ్మాయి నా పెళ్లాం.. ఎస్సైతో అఫైర్..

కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ ఎస్సై-2గా పనిచేస్తున్న విజయ్ కుమార్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ముసునూరులో ఎస్సైగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆ సమయంలో నూజివీడుకు చెందిన బ్యూటీషియన్‌తో వివాహేతర స

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (10:20 IST)
కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ ఎస్సై-2గా పనిచేస్తున్న విజయ్ కుమార్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ముసునూరులో ఎస్సైగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆ సమయంలో నూజివీడుకు చెందిన బ్యూటీషియన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

ఆపై బ్యూటీషియన్ భర్తను వేధించడం మొదలెట్టాడు. ఎస్సై వేధింపులను తాళలేక.. తన భార్యతో కలిసి ఎస్సై చేస్తున్న రాసలీలల ఫోటోలను ఆమె భర్త సోషల్ మీడియాలో పెట్టేశాడు. దీంతో ఎస్సై బాగోతం వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే బ్యూటీషియన్ భర్త సాయి తేజ్ ఆమెకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని విషయాన్ని పెద్దలకు తెలిపాడు. వ్యవహారం విడాకుల వరకు వెళ్లింది. అయితే పెద్దలు సర్దిచెప్పడంతో సరే అని మళ్లీ ఆమెతో కలిసి జీవించేందుకు అంగీకరించాడు. కానీ ఎస్సై విజయ్ కుమార్ మాత్రం వెనక్కి తగ్గలేదు. అతనిని బెదిరిస్తూనే అతడి భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. 
 
దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, తనపై వేధింపులు తప్పవని నిర్ణయానికి వచ్చిన బ్యూటీషియన్ భర్త, వారిద్దరూ వ్యక్తిగతంగా ఉన్న ఫోటోలు సేకరించి, ఒక వీడియో తయారు చేసి, సోషల్ మీడియాలో పెట్టేశాడు. అంతేగాకుండా వీరిద్దరూ తనను చంపేందుకైనా వెనుకాడరని.. వాపోయాడు.

వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి తన పెళ్లాం. అయినా ఎస్సైతో అక్రమ సంబంధంలో వుంది. వీరి సంబంధానికి తాను అడ్డుపడుతానేమోనని తనను చంపించేందుకు ప్లాన్ చేశారని తెలిసింది. అందుకే ఈ వీడియోను పోస్టు చేశాను. ఎవరైనా తనను కాపాడండి అంటూ సాయి వేడుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై దర్యాప్తుకు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆ వీడియోను మీరూ చూడండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments