Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొప్పురావూరులో ప్రేమికుడి కళ్లలో కారం కొట్టి కాళ్లూ చేతులూ నరికింది వీళ్లే

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (18:24 IST)
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరులో జరిగిన ప్రేమికుడి హత్యకేసుని అర్బన్ పోలీసులు చేధించారు. ఈ హత్యలో పాల్పంచుకున్న ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి హత్యకు వినియోగించిన మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఆర్.ఎన్ అమ్మిరెడ్డి హత్య కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

కొప్పురావూరు గ్రామంలో నివాసం ఉంటున్న విన్నకోట కుమారి, శివకోటేశ్వరరావు దంపతుల సంతానమైన విన్నకోట వెంకటేష్ (23) కార్ డ్రైవర్‌గా పనిచేస్తూ... అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. యువతి తండ్రి తో పాటూ వారి బంధువులకు అది నచ్చకపోవడంతో పెద్దల సమక్షంలో వెంకటేష్‌ని హెచ్చరించి వదిలిపెట్టా రు. అయినప్పటికీ వెంకటేష్ ఆ యువతితో మాట్లాడుతూనే ఉండటమే కాకుండా...యువతి సోదరుడైన వైష్ణ మణితేజని అడ్డుతొలగించుకోవాలని... ప్రయత్నం చేసినట్లు యువతి తండ్రికి తెలిసింది.

దీంతో పథకం ప్రకారం వెంకటేష్‌ని ఈ నెల 27న సాయంత్రం 8.30 నిమిషాల సమయంలో భరత్ కుమార్ అనే యువకుడి ద్వారా కొప్పురావూరు సాయికృష్ణ వెంచర్ వద్దకు పిలిపించి ఆరుగురు వ్యక్తులు కలిసి కత్తులతో విచక్షణా రహితంగా కాళ్ళు, చేతులు నరికారు. ఈ క్రమంలో తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న వెంకటేష్‌ని జీజీహెచ్‌కి తరలించగా అతను చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో మృతుడి తల్లి కుమారి ఫిర్యాదు మేరకు మంగళగిరి నార్త్ SDPO దుర్గాప్రసాద్ పర్యవేక్షణలో పెదకాకాని ఇన్స్పెక్టర్ యు.శోభన్ బాబు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ క్రమంలో కేసులో నిందితులుగా ఉన్న కొట్టేభాస్కర్ రావు (A1), కొట్టే దుర్గారావు (A2), కొట్టే మోహన్ (A3), కొట్టే వెంకట గోపీ (A4), కొట్టే వైష్ణవ మణితేజ (A5), తోట భరత్ కుమార్ (A6) లని అరెస్టు చేసి వారి నుండి 2 కత్తులు, కారం పొడి ప్యాకెట్లు, మోటార్ సైకిళ్ళతో పాటూ, సెల్ ఫోన్ల ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments