ఆహా ఏమి విచిత్రం... రాజకీయ నేత కటౌట్‌కు 15 మంది ఖాకీల భద్రత!

Webdunia
సోమవారం, 27 మార్చి 2023 (11:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా నేతలు తమ అధికార దర్పాన్ని బాగానే ప్రదర్శిస్తున్నారు. తమ ఏలుబడిలో తాము చెప్పిందే వేదమన్నట్టుగా నడుచుకుంటున్నారు. సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు.. దాన్ని పక్కన బెట్టి రాజకీయ నేతల కటౌట్ల భద్రతలో నిమగ్నమయ్యారు. ఈ వింత దృశ్యం జిల్లా కేంద్రమైన నెల్లూరులో కనిపించింది. స్థానిక నర్తకి థియేటర్ సెంటరులో మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌కు 15 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేశారు. దీనికి 15 మంది పోలీసులు కాపలాగా ఉంటున్నారు. వీరిలో ఒకరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కూడా ఉండటం గమనార్హం. 
 
రెండు రోజుల క్రితం అనిల్ కుమార్ జన్మదినం సందర్భంగా నెల్లూరు నగర వ్యాప్తంగా ఆయన కటౌట్లు బ్యానర్లతో నింపేశారు. నర్తకి సెంటరులో అయితే, ఏకంగా భారీ కటౌట్‌ను ఏర్పాటుచేశారు. అయితే,ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి అనిల్ కటౌట్ అడ్డుగా ఉందని, దాన్ని తొలగించాలంటూ నెల్లూరు నగర పాలక సంస్థ అధికారులను టీడీపీ నగర ఇన్‌ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కోరారు. కానీ వారు పట్టించుకోలేదు.
 
ఈ క్రమంలో తాజాగా టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదివారం నర్తకి సెంటర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించేందుకు వచ్చారు. ఈ క్రమంలో ఎవరైనా అనిల్ కుమార్ యాదవ్ కటౌట్‌ను కూల్చివేస్తారన్న అనుమానంతో పోలీసులు ఏకంగా 15 మందితో పోలీసులు పహారాగా ఉన్నారు. ఈ వార్త స్థానిక పత్రికలతో పాటు టీవీల్లో రావడంతో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

Samyuktha: ది బ్లాక్ గోల్డ్ లో రక్తపు మరకలతో రైల్వే ఫ్లాట్ పై సంయుక్త ఫస్ట్ లుక్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

Naveen Polishetty: అనగనగా ఒక రాజు తో సంక్రాంతి పోటీలో నవీన్ పోలిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments