ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన హరీష్‌ను తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా వైసీపీ సానుభూతిపరుడు హరీష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
శుక్రవారం రాత్రి హరికృష్ణ రెడ్డిని జిల్లా కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.
హరికృష్ణా రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో హరి కృష్ణారెడ్డి అనుచిత పోస్టులు పెట్టడంతో హరీష్‌ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఇప్పటికే సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టే వారిపై ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.