Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం ప్రాజెక్టు: రూ. 7,192 కోట్లు పెంచుతూ ఆదేశాలు

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (18:47 IST)
పోలవరం ప్రాజెక్టు లోని ప్రధాన డ్యామ్ అంచనాల పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ అంచనాలను రూ. 7,192 కోట్లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. గతంలో ప్రధాన డ్యామ్ నిర్మాణం కోసం రూ. 5,535 కోట్లుగా జలవనరుల శాఖ నిర్ధారించింది.
 
అయితే ప్రధాన డ్యామ్ లో భాగమైన స్పిల్ వే, ఈసీఆర్ ఎఫ్, స్పిల్‌, పైలట్ ఛానల్ తదితర నిర్మాణాల అంచనాలను మరో రూ. 1600 కోట్ల మేర పెంచుతూ జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
 
ఇక ఈ మధ్యనే సాగునీటి ప్రాజెక్టుల ప్రగతిపై నీటిపారుదల శాఖ అధికారులతో క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. వర్షాలు వచ్చేలోగా పూర్తి చేయాల్సిన పనుల పై సీఎం సమీక్ష నిర్వహించారు. 
 
కాఫర్‌ డ్యాంలో ఖాళీలు పూర్తి, అప్రోచ్‌ ఛానల్, స్పిల్‌ ఛానల్, గేట్ల పూర్తి, మెయిన్‌ డ్యాం పనులు తదితర కీలక పనులపై సీఎం సమీక్ష జరిపారు. స్పిల్‌ ఛానల్‌లో మట్టి మరియు కాంక్రీట్ పనుల తవ్వకం పనులను మరింత వేగవంతం చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. 
 
రానున్న 45 రోజులు అత్యంత కీలకమని, వర్షాలు వచ్చేలోగా పనులు అత్యంత వేగంగా, సమర్థవంతంగా జరగాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వం ప్రాధాన్యత గా తీసుకున్న ప్రాజెక్టులకు నిధుల విషయంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. పోలవరం సహా ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో నిధుల విడుదలతో పాటు అన్ని రకాలుగా ప్రభుత్వం అడుగులేస్తుందని జగన్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments