Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీతో ఒరిగిందేమీ లేదు.. ఓట్లు అదనంగా పడలేదు: చంద్రబాబు

రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే బీజేపీతో స్నేహాన్ని కొనసాగించామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే బీజేపీ స్నేహం వల్ల ఒరిగిందేమీ లేదని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 సాధారణ ఎన

Webdunia
శుక్రవారం, 9 మార్చి 2018 (12:51 IST)
రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే బీజేపీతో స్నేహాన్ని కొనసాగించామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే బీజేపీ స్నేహం వల్ల ఒరిగిందేమీ లేదని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 సాధారణ ఎన్నికలకన్నా ముందే జరిగిన స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 
 
బీజేపీతో పొత్తు లేకుండా బరిలోకి దిగిన సమయంలో ఎన్ని ఓట్లు పడ్డాయో.. అదే ఓట్లే పొత్తుకు తర్వాత కూడా వచ్చాయని.. బీజేపీ వల్ల అదనంగా ఎలాంటి ఓట్లు రాలేదని మంత్రులు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయినప్పటికీ రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో  ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నామన్నారు.
 
హోదాకు సమానమైన ప్యాకేజీని ఇస్తామంటేనే కేంద్ర ప్రతిపాదనలకు అంగీకరించామని చంద్రబాబు మరోసారి గుర్తు చేశారు. ఈఏపీ ద్వారా నిధులు ఇస్తామని ఏడాదిన్నర క్రితం కేంద్రం హామీ ఇచ్చిందని.. కానీ ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోలేదని నిప్పులు చెరిగారు. యూసీలు కావాలని కేంద్రం అడిగిన ప్రతిసారీ, ఎప్పటికప్పుడు స్పందించి పంపుతూనే ఉన్నామని తెలిపారు. రాష్ట్రానికి సాయం చేసి ఆదుకోవాల్సింది పోయి.. బీజేపీ ఎదురుదాడికి దిగుతుందని చంద్రబాబు మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments