కేంద్ర మంత్రిపదవులకు గజపతిరాజు - సుజనా చౌదరీలు రాజీనామా
కేంద్రమంత్రి పదవులకు టీడీపీకి చెందిన అశోకగజపతి రాజు, సుజనా చౌదరిలు రాజీనామా చేశారు. వారిద్దరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గురువారం సాయంత్రం తమ రాజీనామా లేఖలను స్వయంగా అందజేశారు.
Publish Date: Thu, 08 Mar 2018 (18:13 IST)
Updated Date: Thu, 08 Mar 2018 (18:24 IST)
కేంద్రమంత్రి పదవులకు టీడీపీకి చెందిన అశోకగజపతి రాజు, సుజనా చౌదరిలు రాజీనామా చేశారు. వారిద్దరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గురువారం సాయంత్రం తమ రాజీనామా లేఖలను స్వయంగా అందజేశారు.
నిజానికి వారిద్దరూ బుధవారం రాత్రే రాజీనామా చేయాల్సి వుంది. కానీ, ప్రధాని నరేంద్ర మోడీ అందుబాటులో లేకపోవడంతో వారు రాజీనామా చేయలేదు. ఆ తర్వాత గురువారం ఉదయం ప్రధాని మోడీ రాజస్థాన్ పర్యటనకు వెళ్లారు.
అక్కడ నుంచి తిరిగివచ్చాక గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో వీరిద్దరూ ప్రధాని మోడీని కలిసి తమ రాజీనామా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా తాము ఏయే కారణాల వల్ల కేంద్ర మంత్రి వర్గం నుంచి బయటకు వస్తున్నామో మోడీకి వివరించారు.
కాగా, టీడీపీ సీనియర్ నేతల్లో ఒకరైన అశోకగజపతి రాజు కేంద్ర పౌరవిమానయాన శాఖామంత్రిగా ఉన్నారు. ఈయన కేబినెట్ మంత్రిగా ఉన్నప్పటికీ విమానాల్లో ప్రయాణించేందుకు అవసరమైన బోర్డింగ్ పాస్‌లు తీసుకునేటపుడు, విమానం ఎక్కేటపుడు ఒక సాధారణ పౌరుడిలా నడుచుకునేవారు. అలాగే, మరో సీనియర్ నేత వైవీఎస్ చౌదరి (సుజనా చౌదరి) కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.
pnr
Publish Date: Thu, 08 Mar 2018 (18:13 IST)
Updated Date: Thu, 08 Mar 2018 (18:24 IST)