తెలుగు రాష్ట్రాల రైతులకు శుభవార్త... దీపావళి కానుక PMKSY నిధులు విడుదల

సెల్వి
మంగళవారం, 14 అక్టోబరు 2025 (13:52 IST)
రైతులకు శుభవార్త. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన 21వ విడతకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన ద్వారా దేశవ్యాప్తంగా  కొన్ని కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇప్పటివరకు 20 విడతల్లో నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా 21వ విడుత నిధులను విడుదల చేయడానికి  సిద్ధమైంది. 
 
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పీఎం కిసాన్ నిధులు అతి త్వరలోనే విడుదల కానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి రూ.171 కోట్ల తక్షణ సహాయం కింద జమ్మూ కాశ్మీర్‌లోని వరద బాధిత రైతులకు అందాయి. ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బంది పడుతున్న లక్షలాది మంది రైతులకు తక్షణ సాయంగా ఈ నిధి ఉపకరిస్తుంది. 
 
అయితే ఈ రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మిగతా రాష్ట్రాల్లో కూడా  అతి త్వరలోనే పీఎం కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన 21వ విడుత నిధులు విడుదల కానున్నాయి. అయితే ఈ నిధులు వీలయితే దీపావళి ముందుగానే లేకపోతే అక్టోబర్ చివరి వారంలో విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం. 
 
ఇక రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందాలంటే ముందుగానే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన ప్రతి ఏడాది రూ.6000 కాగా వీటిని నాలుగు నెలలకు ఒకసారి మూడు దఫాల్లో విడుదల చేస్తారు.  ఈ ఏడాది చివరి దఫా నిధులు ఈ నెలలో విడుదల కానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: ఏజెంట్ మ్రిచిగా శ్రీలీల ఫస్ట్ లుక్ - కొత్త ట్విస్ట్

Vishnu Vishal: విష్ణు విశాల్... ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ రాబోతోంది

Sri Vishnu: మిత్ర మండలి ని మైండ్‌తో కాకుండా హార్ట్‌తో చూడండి : శ్రీ విష్ణు

తెలుసు కదా ఒక రాడికల్ సినిమా అవుతుంది : సిద్ధు జొన్నలగడ్డ

Sundeep Kishan: సూపర్ సుబ్బు సిరీస్.. సెక్స్ ఎడ్యుకేషన్ ... సందీప్ కిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments