సెప్టెంబర్ 22న ప్రారంభమైన ద అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 భారతదేశంవ్యాప్తంగా ఉన్న కస్టమర్ల కోసం ఆనందం, సమృద్ధిల సమయాన్ని ఆహ్వానిస్తోంది. అమేజాన్ గ్రాసరి ప్రధాన అవసరాలు, పండగ బహుమతులు, విలాసవంతమైన అనుభవాలలో శక్తివంతమైన వృద్ధిని చూసింది, కస్టమర్లు సంప్రదాయబద్ధమైన ఇష్టాలతో ఆరోగ్య స్ప్రహకు సంబంధించిన ఎంపికలను ఏ విధంగా మిశ్రమం చేస్తున్నారో సూచిస్తోంది. బెర్రీస్, అవొకడోస్ వంటి ప్రీమియం పండ్లు వరుసగా 3 రెట్లు, 2 రెట్లు పెరిగాయి, నట్స్ 21 రెట్లు పెరిగాయి, ఇది ప్రీమియం మరియు సంక్షేమానికి దారితీసే బహుమతుల పెంపుదలను సూచిస్తున్నాయి.
ఇటీవలి GST తగ్గింపులు అన్ని శ్రేణుల్లో కస్టమర్ డిమాండ్ ను రూపొందించడంలో కీలకమైన బాధ్యతవహించాయి-పానియాలు, ఆయిల్స్ మరియు తృణ ధాన్యాలు BAUతో పోలిస్తే 100% కంటే ఎక్కువ పెరిగాయి. అధిక ప్రోటీన్ గల ఆహారాలు, D2C బ్రాండ్స్ నుండి స్ప్రెడ్స్ కోసం డిమాండ్ 150%కి పెరిగింది. సమగ్రమైన సంక్షేమం ప్రత్యేకమైన ప్రాధాన్యతగా నిలిచింది, BAUతో పోలిస్తే వే ప్రోటీన్ సేల్స్ 180%కి పెరిగాయి, BAUతో పోలిస్తే విటమిన్స్ & సప్లిమెంట్స్ 250% పెరిగాయి, టియర్ 2+ కస్టమర్లు 1.5 రెట్లు పెంపుదలకు తోడ్పడ్డారు.
కస్టమర్లు ధనత్రయోదశి, దీపావళిల కోసం సిద్ధపడగా, అమేజాన్ ఫ్రెష్, ఎవ్విరిడే ఎసన్షియల్స్ ప్రత్యేకమైన పండగ స్టోర్ ఫ్రంట్స్ ఇండియన్ స్వీట్స్ స్టోర్, ధంతేరస్ స్టోర్, డ్రై ఫ్రూట్ స్టోర్, గిఫ్టింగ్ స్టోర్ ఫ్రంట్, GST బచత్ ఉత్సవ్ వంటి వాటిని తీసుకువస్తున్నాయి. ఇవి కస్టమర్లు సౌకర్యం, తాజాదనం, మరియు గొప్ప విలువతో వేడుక జరపడానికి కస్టమర్లకు సహాయపడటానికి సంప్రదాయబద్ధమైన రుచులు యొక్క రూపొందించిన ఎంపికలను, ప్రీమియం డ్రై ఫ్రూట్స్, గిఫ్టింగ్ హ్యాంపర్స్, పండగ అవసరాలను అందిస్తున్నాయి. కస్టమర్లు IDFC డెబిట్ కార్డ్స్‌తో పాటు ఏక్సిస్ బ్యాంక్, RBL, IDFC, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్స్ నుండి క్రెడిట్ కార్డ్, EMI లావాదేవీలపై 70% వరకు తగ్గింపును, 10% తక్షణ డిస్కౌంట్‌ను ఆనందించవచ్చు.
4 దశల నాణ్యతా తనిఖీతో స్థానిక రైతుల నుండి నేరుగా సంపాదించిన ఫారం-తాజా కిరాణా నుండి నిత్యావసరాలు, భారతదేశపు మిఠాయిలు, గోర్మెట్ కిరాణా సరుకులు, డ్రై ఫ్రూట్స్, చాకొలెట్స్, ఆఖరి నిముషంలో కొనుగోలు చేసే బహుమతుల వరకు అమేజాన్ గ్రోసరి విస్తృత శ్రేణి ఎంపికను గొప్ప విలువకు అందిస్తోంది, అన్నింటిని 2 గంటల సౌకర్యవంతమైన డెలివరీతో అందిస్తోంది.