Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

Advertiesment
Fabindia-s Svarnim 2025

ఐవీఆర్

, బుధవారం, 8 అక్టోబరు 2025 (23:17 IST)
సీజన్ యొక్క ఆత్మీయత, కాంతి, ఆనందాన్ని వేడుక జరుపుకుంటూ, ఫ్యాబ్ఇండియా తమ దీపావళి 2025 కలెక్షన్‌ను స్వర్నిమ్ పేరిట విడుదల చేసింది. ఊదా, నీలం రంగుల లోతైన ఛాయలతో ప్రేరణ పొందిన ఈ కలెక్షన్, సాంప్రదాయ పనితనంను సమకాలీన డిజైన్‌తో మిళితం చేస్తుంది. ఇది పండుగ శైలి, బహుమతి కోసం పరిపూర్ణంగా ఉంటుంది.
 
కలెక్షన్ లోని ప్రతి ఉత్పత్తి, భారతీయ పనితనం పట్ల ఫ్యాబ్ఇండియా నిబద్ధతను ప్రదర్శిస్తుంది, చేతితో నేసిన వస్త్రాలు, చేతివృత్తులకు సంబంధించిన లోతైన వివరాలను ఆధునిక సౌందర్యంతో మిళితం చేస్తుంది. వ్యక్తిగత స్టైలింగ్ లేదా బహుమతి కోసం తగినట్లుగా పరిపూర్ణమైన ఉత్పత్తులను అందిస్తూనే ఈ కలెక్షన్ వారసత్వాన్ని వేడుక జరుపుకుంటుంది.
 
మొత్తం కుటుంబానికి పండుగ దుస్తులు
ఈ కలెక్షన్ మొత్తం కుటుంబానికి ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పండుగ దుస్తులను అందిస్తుంది. మహిళలు సొగసైన ఎంబ్రాయిడరీ, ప్రింటెడ్ కుర్తాలు, ట్యూనిక్స్, సిల్క్ చీరలను అన్వేషించవచ్చు, పురుషులు సాంప్రదాయ రూపంలో కుర్తాలు, బందగల జాకెట్లలో ఆధునిక కట్‌లను ఎంచుకోవచ్చు. స్కర్ట్ సెట్‌లు, ధోతీ-కుర్తా సెట్‌లు వంటి పిల్లల దుస్తులు, మరెన్నో శైలితో సౌకర్యాన్ని మిళితం చేస్తాయి. స్టైల్, గిఫ్టింగ్ మరియు వేడుకల కోసం రూపొందించిన చేతితో చేసిన పాదరక్షలు, బ్యాగులు, ఆభరణాలతో సహా ఫ్యాబిండియా క్యూరేటెడ్ ఉపకరణాలతో మీ పండుగ రూపాన్ని సంపూర్ణం చేసుకోండి.
 
ప్రతి వేడుకను ప్రకాశవంతం చేయడానికి ఇంటి అలంకరణ
ఫ్యాబ్ఇండియా యొక్క ఫ్యాబ్‌హోమ్ శ్రేణి నివాస ప్రాంగణాలకు పండుగ మెరుపును జోడిస్తుంది. హ్యాండ్‌క్రాఫ్ట్ చేసిన దీపాలు, ఎంబ్రాయిడరీ సిల్క్ బ్లెండ్ కుషన్లు, ఇత్తడి థాలిలు, దియాలు మీ ఇంటికి ఆత్మీయత, ఆకర్షణను తీసుకురావడానికి రూపొందించబడ్డాయి, అదే సమయంలో శైలి మరియు సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆదర్శ బహుమతులను కూడా తయారు చేస్తాయి.
 
స్వర్నిమ్ 2025 దీపావళి కలెక్షన్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఫ్యాబ్ఇండియా స్టోర్‌లలో, fabindiaలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. హ్యాండ్‌క్రాఫ్ట్ చేసిన చక్కదనం, శక్తివంతమైన శైలి, ప్రతి దీపావళి క్షణాన్ని ప్రత్యేకంగా చేసే ఆలోచనాత్మకంగా రూపొందించిన ఉత్పత్తులను ఇంటికి తీసుకురావడం ద్వారా సీజన్‌ను వేడుక జరుపుకోండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు