Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీజీహెచ్, ఎన్నారై ఆసుపత్రుల్లో 'ప్లాస్మా థెరపీ ప్రారంభం'.. ప్లాస్మా దానం చేసిన పొన్నూరు ఎమ్మెల్యే

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (07:08 IST)
కోవిడ్-19 మరణాల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని గుంటూరు జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్ అన్నారు. గుంటూరు రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన ప్లాస్మా డోనార్ సెల్ ని జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్ ప్రారంభించగా కోవిడ్ నుండి కోలుకున్న పొన్నూరు శాసనసభ్యులు కిలారి రోశయ్య మొట్టమొదటి గా ప్లాస్మా దానం చేశారు.
 
ఈ సందర్భంగా భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్న 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ లోపు పురుషులు ప్లాస్మా ఇచ్చేందుకు అర్హులని, ఆసక్తి ఉన్న వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రితో పాటూ ఎన్నారై ఆసుపత్రిలో ప్లాస్మా  థెరపీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
 
పొన్నూరు శాసనసభ్యులు కిలారి రోశయ్య మాట్లాడుతూ కోవిడ్ బాధితులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, కోవిడ్ మహమ్మారి నియంత్రణ కోసం ప్రభుత్వం అనేక వ్యవస్థల ద్వారా కృషిచేస్తుందని చెప్పారు. ఓ నెగిటివ్ గ్రూప్ ప్లాస్మాని తాను మొదటిగా దానం చేయడం సంతోషంగా ఉందని అన్నారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments