Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరదలిపై అక్కమొగుడు అత్యాచారం, గర్భం దాల్చడంతో...

Webdunia
శనివారం, 23 మే 2020 (17:12 IST)
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని ఓ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్క మొగుడు 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసాడు. ఆమె గర్భందాల్చడంలో అబార్షన్ చేయించుకోమని సలహా ఇచ్చాడు. ఈ క్రమంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
 
వివరాల్లోకి వెళితే, కంచిలి మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు, పెద్ద కుమార్తెను కోల్‌కతాలో పనిచేసే వ్యక్తికి ఇచ్చి కొంతకాలం క్రితం పెళ్లి చేసారు. జనవరిలో అత్త ఇంటికి వచ్చిన అతను మరదలిని మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. పలుమార్లు అఘాయిత్యం చేసి గర్భం దాల్చేలా చేసాడు.
 
గర్భందాల్చిన కుమార్తెను గమనించి తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. కోల్‌కతాలో ఉన్న అల్లుడికి ఫోన్ చేసి నిలదీయగా, లాక్‌డౌన్ పూర్తయ్యాక వచ్చి మాట్లాడుకుందామని జవాబు ఇచ్చాడు. ఈ విషయం తెలిస్తే ఇరు కుటుంబాల పరువు పోతుందని బెదిరించాడు. అబార్షన్ చేయించమని, దానికి అయ్యే ఖర్చులు తనే భరిస్తానని నమ్మబలికాడు.
 
తల్లిదండ్రులు బాలికను వారం రోజుల క్రితం సోంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించారు. ఇంటికి వెళ్లాక బాలిక ఆరోగ్యం క్షీణించడంతో మూడురోజుల క్రితం మళ్లీ అదే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరిస్థితి మెరుగుపడకపోవడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక చనిపోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments