ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు రాజధానులు : పయ్యావుల కేశవ్ ఎద్దేవా

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (10:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు రాజధానులు అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. వచ్చే 2024 వరకు నవ్యాంధ్రకు హైదరాబాద్ నగరమే రాజధాని అంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై పయ్యావుల మండిపడ్డారు. ఇపుడు ఏపీకి మూడు రాజధానులకు తోడు నాలుగు రాజధాని కూడా వచ్చేసింది అంటూ ఎద్దేవా చేశారు. 
 
గత ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని రకాలుగా సాయం చేసిన తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌కు రుణం తీర్చుకోవడానికి ఏపీని అన్ని విధాలుగా నాశనం చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని, అందుకే తొలుత మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. 
 
ఇపుడు హైకోర్టు తీర్పుతో ఏం చేయాలో తోచక నాలుగో రోజధాని డ్రామాకు తెరలేపారన్నారు. ఏపీ రాజధాని అమరావతి విషయంలో వైకాపా నేతల మనస్సులో ఎంత వ్యతిరేకత ఉందో మంత్రి బొత్స వ్యాఖ్యలతో మరోసారి బయపడిందన్నారు. 
 
వైకాపా నేతలు ఇప్పటికీ హైదరాబాద్‌నే నవ్యాంధ్ర రాజధానిగా భావిస్తున్నారన్నారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన వాటి విషయంలో వైకాపా నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక అసెంబ్లీ సమావేశాలు కాలేజీలో ర్యాగింగ్‌ను తలపించేలా సాగుతున్నాయని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments