Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్వారంపూడికి "భీమ్లా నాయక్" ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తా : పవన్ కళ్యాణ్

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (21:13 IST)
వైకాపాకు చెందిన కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్‌కు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ద్వారంపూడి తన వైఖరిని మార్చుకోకుంటే భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తానంటూ హెచ్చరించారు. గుంటూరు జిల్లాలోని ఇచ్చంట గ్రామంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. 
 
"వైకాపా అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి గారికి ఓ విషయం చెప్పదలచుకున్నాను. మీ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ అనే వ్యక్తి అకారణంగా నన్ను పచ్చిబూతులు తిట్టారు. వినకూడని మాటలు అన్నాడు. అయినా నేను ఊరుకున్నాను. కానీ, మా జనసైనికులకు కోపాలు వచ్చాయి. 
 
పంతం నానాజీ వంటి నేతలకు కోపాలు వచ్చాయి. ఎందుకు ఇలా అన్నావంటూ వారు నిలదీయడానికి వెళితే వారిపై దాడులు చేశారు. నన్ను అన్న మాటలతో నాకు బాధ అనపించలేదు. కానీ, వీర మహిళలు వారు అనిపించుకున్న మాటలు నాకు చెబితే అయ్యో వీళ్లను ఎందుకు రాజకీయాల్లో దించాను అని బాధపడ్డాను. 
 
వైవీ సుబ్బారెడ్డిగారు... మీ  పెద్దవాళ్లు, విజ్ఞులు.. ఇలాంటి వారికి గడ్డిపెట్టండి. ఈ సందర్భంగా ద్వారంపూడికి చంద్రశేఖర్ కూడా చెబుతున్నాం. గతంలో మీ కుటుంబానికి ఎస్పీ డీటీ నాయక్ గారి ట్రీట్మెంట్ జరిగింది. భవిష్యత్‌లో కూడా మీరు ఇలాగే వ్యవహరిస్తే "భీమ్లా నాయక్" ట్రీట్మెంట్ అంటే ఏమిటో చూపిస్తా" అని గట్టి వార్నింగ్ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments