Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజల్లో ఆశలు కల్పించి.. కాదంటే అశాంతి రగులుతుంది : పవన్ కల్యాణ్

విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రజలకు ఆశలు కల్పించి, ఇపుడు కాదంటే అశాంతి రగులుతుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీకి కేంద్రం ఇచ

Webdunia
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (17:47 IST)
విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రజలకు ఆశలు కల్పించి, ఇపుడు కాదంటే అశాంతి రగులుతుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్రం ఖర్చు చేసిన నిధులు ఎంత అనే అంశంపై నిజానిజాలు తెలుసుకునేందుకు పవన్ సంయుక్త నిజనిర్థారణ కమిటీ (జేఎఫ్‌సీ)ని ఏర్పాటు చేసిన విషయం తెల్సందే. 
 
ఈ కమిటీ తొలి సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, జేఎఫ్‌సీతో కలిసి పనిచేసేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారన్నారు. జేఎఫ్‌సీ సమావేశాలు ఇక నుంచి వరుసగా జరుగుతాయన్నారు. కొన్ని రోజుల తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టంచేశారు. 
 
విభజన చట్టం హామీలపై ఎవరి దారిలో వారు పోరాటం చేస్తారన్నారంటూ టీడీపీ, వైకాపాల నుద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. అందరి ప్రయత్నం రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని వివిధ పార్టీల నేతలు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేయాలన్నారు. ఒక ప్రాంతాన్ని దీర్ఘకాలికంగా వెనుకుబాటుతనం పీడిస్తే అక్కడ తిరుగుబాటు వస్తుందన్నారు. 
 
ముఖ్యంగా పాలకులు చేసిన తప్పుల వల్ల ప్రజలు కష్టపడుతున్నారన్నారు. ప్రజల ప్రమేయం లేకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేశారని గుర్తుచేశారు. అదేసమయంలో న్యాయం జరగనపుడు ప్రభుత్వంపై కోపం వస్తుందని అదే అశాంతి, ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments