అమ్మాయిల మిస్సింగ్‌ వెనుక వలంటీర్లు : పవన్ కళ్యాణ్

Webdunia
సోమవారం, 10 జులై 2023 (14:53 IST)
వారాహి విజయ యాత్రలో భాగంగా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన రెండో దశ యాత్రను ఆదివారం ఏలూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ వాలంటీర్ వ్యవస్థను టార్గెట్ చేస్తూ కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 17 వేల మంది అమ్మాయిల మిస్సింగ్‌కు వాలంటీర్ వ్యవస్థే కారణమని కేంద్ర నిఘా వర్గాల నుంచి తనకు సమాచారం ఉందని అన్నారు.
 
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్లు... గ్రామంలో ఎవరు ఎవరి మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, అందులో అమ్మాయిలు ఎంతమంది, వారికి ఏమైనా ప్రేమ వ్యవహారాలు ఉన్నాయా, వితంతువులు ఎంతమంది, మగవాళ్లకు ఏమైనా అలవాట్లు ఉన్నాయా? అనే వివరాలను సేకరిస్తారని, వాలంటీర్ల ద్వారా ఆ వివరాలు సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లోకి వెళుతున్నట్టు కేంద్ర నిఘా పెద్దలు తనకు చెప్పారని పవన్ వివరించారు.
 
దాంతో ఆ సంఘ వ్యతిరేక శక్తులు అమ్మాయిలను ట్రాప్ చేసి మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్టు తెలిసిందని పవన్ మండిపడ్డారు. అయితే, ఈ వ్యాఖ్యలను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తప్పుబట్టారు. వాక్ స్వాతంత్ర్యం ఉన్నది అభిప్రాయాలు చెప్పడానికి, భిన్నాభిప్రాయాలతో చర్చాకార్యక్రమాలతో వాదించడానికి అని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments