Webdunia - Bharat's app for daily news and videos

Install App

రణస్థలం వేదికగా జనసేన యువశక్తి - పోస్టర్ ఆవిష్కరించిన పవన్

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (19:31 IST)
జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరిట భారీ బహిరంగ సభ జరుగనుంది. స్వామి వివేకానందుడి స్ఫూర్తిగా తీసుకుని ఈ సభను నిర్వహిస్తున్నట్టు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ యువశక్తి సభకు సంబంధించిన పోస్టరును ఆయన సోమవారం ఆవిష్కరించారు. 
 
స్వామి వివేకానంద జయంతి రోజున, ఆయన స్ఫూర్తితో ఈ నెల 12వ తేదీన ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దీనికి యువతీ యువకులంతా ఆహ్వానితులేనని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని యువగళం వినిపించేలా ఈ యువశక్తి సభ ఉంటుందని తెలిపారు. 
 
దేశానికి వెన్నెముక యువతేనని, ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం మనదేనని చెప్పారు. అయితే, ఉత్తారాంధ్రలో యువత చదువులకు, ఉద్యోగ, ఉపాధఇ అవకాశాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొనివుందన్నారు. 
 
ఈ నేపథ్యంలో వలసలు, విద్య, వ్యాపారాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై యువత తమ అభిప్రాయాలు తెలియజేసేలా ఈ యువశక్తి సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభలో తాము మాట్లాడటం కాదని, యువత అభిప్రాయాలను వారి నోటి ద్వారానే చెప్పేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

Charan: పెద్ది ఫర్ ప్రదీప్ అని రామ్ చరణ్ చెప్పడం చాలా హ్యాపీ : ప్రదీప్ మాచిరాజు

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments