Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా చేస్తే నరకానికి వెళ్లరు... పవన్ కళ్యాణ్ : నెలంతా ఘనాహారం బంద్.. (video)

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (15:18 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కార్తీకమాస దీక్ష చేపట్టారు. దీంతో నెల రోజుల పాటు ఆయన ఘనాహారాన్ని స్వీకరించబోనని చెప్పారు. ఈ నెల రోజుల పాటు కేవలం ద్రవాహారమే తీసుకుంటానని తెలిపారు. అదేసమయంలో కార్తీక మాసంలో మొక్కలను నాటడం వల్ల నరకానికి వెళ్లరని శ్రీ వరాహ పురాణంలో వేద వ్యాసుడు పేర్కొన్నాడని, అందువల్ల ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 
 
హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న తన వ్యవసాయక్షేత్రంలో ఆయన వన రక్షణ పేరుతో వన సంరక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఒక్కో రావి, వేప, మర్రి మొక్క.. పది రకాల పూల మొక్కలు.. ఐదు మామిడి మొక్కలు, రెండేసి దానిమ్మ, నారింజ మొక్కలు నాటినవారు నరకానికి వెళ్లరు. వేద వ్యాసుడు రాసిన 'శ్రీ వరాహ పురాణం'లో ఈ విషయం ఉందని ఆయన వెల్లడించారు. 
 
ముఖ్యంగా, భూదానం, గోదానం వల్ల ఎంత పుణ్యం వస్తుందో మొక్కలను నాటి సంరక్షించడం వల్ల అంతే పుణ్యం వస్తుందని ఈ పురాణం చెబుతోందన్నారు. అలాగే, కార్తీక మాసంలో నిర్వహించే వన భోజనాలు వర్గ, కుల భోజనాలు కాకూడదని అన్నారు. అన్ని వర్గాల వారు కలిసి వన సంరక్షణ దిశగా వేసే వన సమారాధన వేదికలు కావాలని పిలుపునిచ్చారు. 
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments