Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపుడు తప్పు చేశాం.. ఇపుడు శిక్ష అనుభవించాం.. పవన్ కళ్యాణ్

Webdunia
శనివారం, 8 జూన్ 2019 (13:52 IST)
గత 2014లో జరిగిన ఎన్నికల్లో పోటీచేసివున్నట్టయితే ముగిసిన ఎన్నికల్లో పార్టీ బలం మరింతగా పెరిగివుండేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు. నాడు చేసిన తప్పుకు ఇపుడు శిక్ష అనుభవించాల్సి వచ్చిందన్నారు. 
 
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ చిత్తుగా ఓడిపోయిన విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి కేవలం ఒక్కటంటే ఒకే స్థానం వచ్చింది. పార్టీ అధినేత హోదాలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ఈ ఫలితాలు జనసేనకు తేరుకోలోని షాకునిచ్చాయి.
 
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా శనివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఉభయగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన నేతలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2014లో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసివుండివుంటే పార్టీ బలం ఇపుడు మరింతగా పెరిగివుండేదన్నారు. అయితే, జనసేన కోసం మహిళలు, యువతీయువకులు స్వచ్ఛంధంగా పని చేశారనీ, అందువల్ల లక్షల ఓట్లు వచ్చాయని చెప్పారు. 
 
మరోవైపు, ఈ ఎన్నికల్లో సక్రమ పద్ధతిలో జరగలేదన్నారు. ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు కోట్లాది రూపాయలను వెచ్చించారన్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఈ ఖర్చు రూ.150 కోట్లకు పైగా ఖర్చు చేశారని గుర్తుచేశారు. కానీ, జనసేన మాత్రం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదన్నారు. 
 
ఓటర్లకు డబ్బు ఎరవేయకుండా స్వచ్ఛమైన రాజకీయాలు చేసినట్టు పవన్ కళ్యాణ్ పార్టీ నేతలతో అన్నారు. ఈ ఎన్నికల ఫలితలతో డీలా పడిపోకుండా ప్రజల కోసం మరింత బలంగా ముందుకు సాగాలని, ఇబ్బందుల్లో ఉన్నవారికి మేమున్నాం అంటూ జనసైనికులు భరోసా ఇవ్వాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments