Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవ్వరినీ మరిచిపోను... శేఖర్ కమ్ములను వదిలిపెట్టను : పవన్ కళ్యాణ్

మెగా హీరో వరుణ్ తేజ్‌కు బంపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ దర్శకుడిపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పగబట్టారు. ఆయన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ తేల్చిచెప్పారు.

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2017 (10:46 IST)
మెగా హీరో వరుణ్ తేజ్‌కు బంపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ దర్శకుడిపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పగబట్టారు. ఆయన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ తేల్చిచెప్పారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు వారికి తగిన విధంగా చెపుతానంటూ హెచ్చరించారు. అసలు శేఖర్ కమ్ములపై పవన్‌కు ఎందుకు అంత కోపమో ఇపుడు తెలుసుకుందాం. 
 
విశాఖపట్నంలో ఉత్తరాంధ్రకు చెందిన జనసేన కార్యకర్తలతో పవన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పట్లో నేను నరేంద్ర మోడీని కలిసినప్పుడు 'పవన్‌ కల్యాణ్‌ ఎవడు' అని హైదరాబాద్ ఎంపీ, ఐఎంఐ అధ్యక్షుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ అన్నారు. నరేంద్ర మోడీని కలిస్తే ద్రోహం చేసినట్లు మాట్లాడారు. దర్శకుడు శేఖర్‌ కమ్ముల వంటి వారు కూడా ట్వీట్‌ చేశారు. ఏదీ మరిచిపోలేదు. సమయం, సందర్భాన్ని బట్టి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాను. ఈ రోజు నేను మోడీని గట్టిగా నిలదీస్తున్నాను. మరి... మీరు అలా మాట్లాడుతున్నారా? అంటూ సూటిగా ప్రశ్నించారు.
 
అంతేకాకుండా, ఇపుడున్న రాజకీయ పార్టీల్లో జాతీయ దృక్పథం ఏదని ప్రశ్నించారు. ఇప్పుడు ఒక్కో పార్టీ ఒక కులానికి ప్రతీక అయిపోయింది. బీజేపీ హిందూ పార్టీ అయిపోయింది. ఇలాకాకుండా... ఒక జాతీయ దృక్పథం ఉన్న పార్టీలు ఎందుకు ఉండవు? అని పవన్ ప్రశ్నించారు. 
 
అలాగే, ఇటీవల తాను లండన్‌కు వెళ్లినప్పుడు ఒక పారిశ్రామికవేత్త తన మొబైల్‌ ఫోన్‌లో షేర్‌ అయిన ఫొటోలు చూపించారు. వైసీపీ లక్ష కోట్లు దోచుకుందని టీడీపీ, టీడీపీయే దోచుకుందని వైసీపీ పెట్టిన ఫొటోలవి. "చెరో లక్షకోట్లు దోచుకుంటే ప్రజలకు ఏం చేస్తారు? రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు ఎలా వస్తాం" అని ఆయన ప్రశ్నించారు. నాకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదన్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments