Webdunia - Bharat's app for daily news and videos

Install App

జల్లికట్టు నిషేధం.. ద్రవిడ సంస్కృతిపై జరుగుతున్న దాడే: పవన్ కల్యాణ్

తమిళనాట జల్లికట్టుపై నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో జ‌ల్లిక‌ట్టు, కోడి పందేలపై పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. త‌మిళ‌నాడులో జ‌ల్లిక‌ట్టు క్రీడ‌ను నిర్వ‌హించ‌డానికి అనుమ‌తి ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర ప్ర‌జ‌

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2017 (12:17 IST)
తమిళనాట జల్లికట్టుపై నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో జ‌ల్లిక‌ట్టు, కోడి పందేలపై పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. త‌మిళ‌నాడులో జ‌ల్లిక‌ట్టు క్రీడ‌ను నిర్వ‌హించ‌డానికి అనుమ‌తి ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగిన వేళ ఆ అంశంతో పాటు కోడిపందేలపై కూడా జ‌న‌సేనాని పవన్ ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌ల్లిక‌ట్టు, కోడిపందేల నిర్వ‌హ‌ణ‌కు పవన్ మ‌ద్ద‌తు తెలిపారు. 
 
త‌మిళ‌నాడులో తన సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో తాను ఓ విషయాన్ని గమనించానని, దక్షిణ భార‌త దేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా చూస్తోందో తాను అర్థం చేసుకున్నాన‌ని వెల్లడించారు. జంతువులను హింసిస్తున్నారన్న కారణంతో జల్లికట్టును నిషేధించారని పేర్కొన్న పవన్ కల్యాణ్... నిజంగా ప్రభుత్వానికి అలాంటి ఆలోచన ఉంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న పౌల్ట్రీ బిజినెస్, బీఫ్ ఎగుమతుల మీద చర్యలు తీసుకోవాలని మరో ట్వీట్ లో పేర్కొన్నారు.
 
జల్లికట్టుపై ఇంత జరుగుతున్నా కేంద్రం మిన్నకుండా ఉండిపోయింది. కేంద్రం ద‌క్షిణ భార‌త దేశాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ఎలా చూస్తోందో చెప్పడానికి ఇదే నిద‌ర్శ‌నమ‌ని పేర్కొన్నారు. జ‌ల్లిక‌ట్టు నిషేధాన్ని ద్ర‌విడ సంస్కృతిపై జ‌రుగుతున్న దాడిగా ఆయ‌న అభివ‌ర్ణించారు. అలాగే మన సంస్కృతి, ఆవులు, మాతృభూమిపై తనకు ఎనలేని గౌరవం ఉందని తెలిపారు. త‌న‌ గోశాలలో 16 ఆవులు ఉన్నాయని, త‌న‌ పొలంలో జీవామృతాన్ని వినియోగించి సాగుచేస్తున్నాన‌ని చెప్పారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments