Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారంతా నన్ను తట్టిలేపే నిశ్బబ్ద యోధులు : పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. తన అభిమాని రచయిత దుశర్ల సత్యనారాయణ రాసిన "జల సాధన సమరం" పుస్తకం కవర్ పేజీని పోస్టు చేశారు.

Webdunia
సోమవారం, 30 ఏప్రియల్ 2018 (10:29 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. తన అభిమాని రచయిత దుశర్ల సత్యనారాయణ రాసిన "జల సాధన సమరం" పుస్తకం కవర్ పేజీని పోస్టు చేశారు. అందులో ఈ సమాజంలోని ఎంతో మంది గొప్ప రచయితలు తనకు స్ఫూర్తినిస్తూ, తట్టి లేపుతుంటారని వారంతా నిశ్శబ్ద యోధులని పేర్కొన్నారు. ఆ తర్వాత మరో అభిమాన రచయిత గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ఓ కవితను పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ కవిత సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కవిత మీరూ చదవండి.
 
"మహితాత్ములు ఎందరు భువిలో
శ్వాస పీల్చి చాలించారో
భూమి మీద నిశబ్దంగా
నడిచి నిష్క్రమించారో
మైకు ఒక్కటి ముట్టలేదు
పత్రికలో మెట్టలేదు
వాళ్లంతా నడిచిన దారులు
వార్తలుగా మారలేదు
మెరిసే మకుటుం మినహా
శిరసె కనిపించని నూతన
రాజులు ఎంగిలి కూతలు
పేజీలైపోతుంటే
చప్పుడు చెయ్యని అడుగులు
చరిత్రలోకెక్కలేదు" అనే కవితను జనసేనాన్ని పోస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments