Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ తీర్పు ప్రజాస్వామినికి ఊపిరి.. పవన్ : న్యాయం - చట్టం గెలిచింది.. కేశినేని

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (12:48 IST)
రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగిస్తూ ఏపీ సర్కారు తెచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్‌పై ఏపీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ ఆర్డినెన్స్‌ను కొట్టివేస్తూ, ఎస్ఈసీగా తిరిగి నిమ్మగడ్డను నియమిస్తూ తీర్పునిచ్చింది. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. 
 
'రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది. అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకి విశ్వాసం ఇనుమడింపజేసింది' అని ఆయన పేర్కొన్నారు. 
 
అలాగే, టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందిస్తూ, హైకోర్టు తీర్పు హర్షణీయమన్నారు. 'న్యాయం గెలిచింది. చట్టం గెలిచింది. ప్రజాస్వామ్యం గెలిచింది. రాజ్యాంగం గెలిచింది. న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకం నిలబడింది' అని కేశినేని నాని ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ ట్వీట్‌ను ముఖ్యమంత్రి జగన్, వైసీపీలకు జత చేశారు.
 
కాగా, ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఎస్ఈసీ రమేశ్ కుమార్‌ను తొలగించడాన్ని హైకోర్టు రాజ్యాంగ వ్యతిరేక చర్యగా స్పష్టంచేసింది. ఆర్డినెన్స్‌ను కొట్టివేస్తున్నట్టు తీర్పును వెలువరించింది. అన్ని జీవోలను కొట్టివేస్తున్నట్టు ప్రకటించిన హైకోర్టు.. రమేశ్ కుమార్‌ను తిరిగి ఎస్ఈసీ‌గా నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments