Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూ.గో: పవన్ కళ్యాణ్ పర్యటన: శ్రమదానంపై ఉత్కంఠ

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (10:04 IST)
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో సంకల్పించిన శ్రమదానంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రంలోని రహదారులు దుస్థితిపై నిరసనలో భాగంగా ఈ కార్యక్రమానికి పిలుపిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ రహదారికి పవన్‌ శ్రమదానం చేయాలని నిర్ణయించారు. 
 
కాగా, భద్రతా కారణాలతో జలవనరుల శాఖ అధికారులు కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. అధికారుల సూచనతో హుకుంపేట రోడ్డుకు కార్యక్రమాన్ని మార్చారు. శ్రమదానం అనంతరం నిర్వహించే సభకు బాలాజీపేట రోడ్డు అనువైనది కాదని పోలీసులు తెలిపారు. మరో ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించామన్నారు.
 
మరోవైపు పవన్‌ పర్యటన దృష్ట్యా అధికారులు ఈ మార్గంలో గుంతలు పూడ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం ఆనకట్ట రహదారిని పోలీసులు మూసేశారు. రాజమహేంద్రవరానికి వెళ్లే మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో వెళ్లే వాహనాలను తనిఖీ చేసి పంపుతున్నారు. 
 
రాజమహేంద్రవరంలో శ్రమదానంలో పాల్గొనడం చట్టవ్యతిరేకమంటూ కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన పార్టీ శ్రేణులకు పోలీసుల ముందస్తు నోటీసులు జారీ చేశారు. పవన్‌ ఈ మధ్యాహ్నం అనంతపురం జిల్లాలోనూ పర్యటించే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

టికెట్ రేట్స్ పై ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మంచిదే: తెలంగాణ చైర్మ‌న్‌ విజేంద‌ర్ రెడ్డి

బుర్ర కథా కళాకారిణి గరివిడి లక్ష్మి కథతో చిత్రం రూపొందబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments