Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశం కోసం గుండె కొట్టుకుంటోంది.. తెలంగాణ కోసం రక్తమిస్తా : పవన్

ఈదేశం కోసం గుండె కొట్టుకుంటోందని, తెలంగాణ కోసం రక్తమిస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తన తెలంగాణ రాష్ట్ర రాజకీయ యాత్రలో భాగంగా, కరీంనగర్‌లోని శుభం గార్డెన్స్‌లో కరీంనగర్‌, నిజామాబాద్‌

Webdunia
మంగళవారం, 23 జనవరి 2018 (14:17 IST)
ఈదేశం కోసం గుండె కొట్టుకుంటోందని, తెలంగాణ కోసం రక్తమిస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తన తెలంగాణ రాష్ట్ర రాజకీయ యాత్రలో భాగంగా, కరీంనగర్‌లోని శుభం గార్డెన్స్‌లో కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల కార్యకర్తలతో పవన్‌ సమావేశమయ్యారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,తెలంగాణ ఉద్యమం ఏ ఆశయాల కోసం జరిగిందో వాటి సాధన కోసం కలిసి వస్తానన్నారు. మడమ తిప్పే మనిషిని కాదని స్పష్టం చేశారు. మాట ఇస్తే తిరిగి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. జనసేనను వేరే పార్టీలో విలీనం చేయాల్సి వస్తే.. మీ ముందు ఎలా ఉంటానని ప్రశ్నించారు. 
 
ఇకపోతే, 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్రంలోనూ జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణ యువత, ఆడపడుచుల ఆకాంక్షే.. జనసేన ఆకాంక్ష. తెలంగాణ ఆశయాల కోసం జనసేన నిలబడుతుందన్నారు. అండగా ఉండండి.. మీ కుటుంబంలో తనను ఒకడిగా చూడండిని కార్యకర్తలను కోరారు. 
 
తాను ఎవరికీ తొత్తును కాదన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగతంగా ఎవరితోనూ శతృత్వం లేదన్న పవన్.. విమర్శించే వారిని పట్టించుకునేందుకు తనకు సమయం లేదన్నారు. తన పనితాను చేసుకుంటూ ముందుకుసాగిపోతానని చెప్పారు. అలాగే, ఎవడికీ భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments