కొండగట్టుకు పవన్ కళ్యాణ్, కేసీఆర్ రెడ్ కార్పెట్... బైటకొచ్చిన రాములమ్మ

ఈమధ్య కాలంలో పెద్దగా రాజకీయాల గురించి మాట్లాడని విజయశాంతి, పవన్ కళ్యాణ్ కొండగట్టు నుంచి యాత్ర చేయడంపై స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన విమర్శనాస్త్రాలు సంధించారు. ఉద్యమ సమయంలో పవన్ కళ్యాణ్ ను ఓ టూరిస్ట్ అంటూ చెప్పడమే కాకుండా అతడెవరో తనకు

మంగళవారం, 23 జనవరి 2018 (11:21 IST)
ఈమధ్య కాలంలో పెద్దగా రాజకీయాల గురించి మాట్లాడని విజయశాంతి, పవన్ కళ్యాణ్ కొండగట్టు నుంచి యాత్ర చేయడంపై స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన విమర్శనాస్త్రాలు సంధించారు. ఉద్యమ సమయంలో పవన్ కళ్యాణ్ ను ఓ టూరిస్ట్ అంటూ చెప్పడమే కాకుండా అతడెవరో తనకు తెలీదని చెప్పారని గుర్తు చేశారు. అలా మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు ఎలా పవన్ కళ్యాణ్ కు కొండగట్టుకు రెడ్ కార్పెట్ వేశారని విమర్శించారు. 
 
ఉద్యమ సమయంలో ఆంధ్రావాళ్లంటూ ఇంతెత్తున లేచిన ముఖ్యమంత్రి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన బిడ్డలను పక్కన పెట్టేసి ఆంధ్రావాళ్లకి ఎలా పెద్దపీట వేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిని జేఏసీ నాయకులకు కూడా ముఖ్యమంత్రి కనీసం పవన్ కళ్యాణ్ కు ఇచ్చినంత గౌరవం ఇస్తే బాగుంటుందని ఆమె అన్నారు. ఉద్యమ సమయంలో ఎవరినైతే దూరంగా పెట్టారో ఇప్పుడు వారినందరినీ కేసీఆర్ అక్కున చేర్చుకుంటున్నారంటూ విజయశాంతి విమర్శించారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఓటుకు నోటు కేసుతో దగ్గరైన ఖాకీలు... అలా సంబంధం... విడాకులు తీస్కుని పెళ్లి...