వైకాపా అనే మహిషానికి కొమ్ములు విరగ్గొడతాం - మాటల తూటాలు పేల్చిన పవన్ కళ్యాణ్

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (22:06 IST)
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఇప్పటంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ జరిగింది. ఇందులో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అదిరిపోయే ప్రసంగం చేశారు. వైకాపా నేతలను, పాలకులను లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు పేల్చారు. జనసేన పార్టీ  పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాల్లో ఇదే హైలెట్ అని ఇప్పుడో సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 
 
"అధికార మదంతో ఒళ్లు బలికి కొట్టుకుంటున్న వైకాపా అనబడే మహిషానికి కొమ్ములు విరగ్గొట్టి కింద కూర్చోబెట్టి వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. ఇదే జనసేన పార్టీ 9న ఆవిర్భావ సభ యొక్క లక్ష్యం. ఉద్దేశం" అని ప్రకటించారు. 
 
అంతేకాకుండా "కూల్చేవాడుంటే కట్టేవాడుంటాడు. విడదీసేవాడుంటే కలిపేవాడుంటాడు. చీకట్లో తోసేవాడుంటే వెలుగులోకి లాక్కొచ్చేవాడుంటాడు. తలెగెరేసే పాలకుడుంటే ఎగిరి తన్నే పరశురాముడు ఉంటాడు. దోపిడీ చేసే వైసీపీ గూండాగాళ్లు ఉంటే వారి దోపిడీని అడ్డుకునే జనసైనికులు ఉంటారు. వైకాపాది విధ్వంసం.. జనసేనది వికాసం. వారిది ఆధిపత్యం మనది ఆత్మగౌరవం. అది అహంకారానికి అడ్డా.. ఇది జనసైనికుల గడ్డ.. జై జనసేన" అంటూ పవన్ కళ్యాణ్ ప్రసంగం ముగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments