Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు చేసిన జనసేన నేతలు.. కేసు నమోదు

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2022 (15:05 IST)
సినీ నటుడు, వైకాపా నేత, ఏపీ చలనచిత్ర అభివృద్ధి మండలి ఛైర్మన్ పోసాని కృష్ణమురళిపై జనసైనికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు ఆ పార్టీకి చెందిన వీరమహిళలను కించపరిచేలా పోసాని వ్యాఖ్యలు చేశారంటూ జనసైనికులు ఆరోపించారు. ఇదే అంశంపై వారు రాజమండ్రి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు పోసానిపై 354, 355, 500, 504, 506, 507, 509 సెక్షన్ల కేసు నమోదు చేశారు. 
 
తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి పోసాని కించపరిచేలా, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాజమండ్రి ఒకటో నంబరు పోలీస్ స్టేషన్‌లో తొలుత ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి... కేసు నమోదు చేయలేదు. 
 
దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. జనసైనికులు వేసిన పిటిషిన్‍‌పై విచారణ జరిపిన కోర్టు... జనసేనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. పోసానిపై తక్షణం కేసు నమోదు చేయాలంటూ పోలీసులను కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయక తప్పలేదు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments