పవన్ సంచలన వ్యాఖ్యలు.. షారూఖ్ కుమారుడి గురించి..?

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2023 (15:38 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానెప్పుడూ నిజం మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని పవన్ అన్నారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ జనసేన పార్టీ పీఏసీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
మైనారిటీల మద్దతు కోసం తాను మాట్లాడటం లేదని చెప్పారు. గతంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కొడుకును డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తే.. ఇదే వేదికపైన ఖండించానని తెలిపారు. తాను ఆర్యన్ అరెస్ట్‌ను ఖండిస్తే.. మాదక ద్రవ్యాల కేసును ఎలా ఖండిస్తావు అని కొందరు ప్రశ్నించారు. 
 
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకోలేదనే నిజం కళ్లముందు కనిపిస్తున్నప్పుడు.. ఖండించకుండా ఎలా ఉంటానని పవన్ ప్రశ్నించారు. ఇక ఆర్యన్ తప్పు చేశాడా? లేదా అనే కోర్టులు నిర్ణయిస్తాయి. షారుక్ ఖాన్‌కు అండంగా నిలిస్తే బీజేపీ నాయకులు బాధపడుతారని తాను ఆలోచించనని తెలిపారు. షారుక్ కొడుకు ఆర్యన్ ఖాన్ స్నేహితుల వద్ద 35 గ్రాముల కొకైన్ లభించిందని, ఆ అబ్బాయికి సంబంధం లేకుండా జైలుకు పంపించారు. ఇలాంటి విషయాలు మాట్లాడితే అందరూ ఇబ్బంది పడుతారని తెలిసినా.. నిజం మాట్లాడాలి కనుక మాట్లాడుతున్నానని చెప్పారు.
 
ఇక రాష్ట్రం విషయానికి వస్తే జగన్ లాంటి క్రిమినల్‌కు భయపడేది లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా జగన్‌ను రాళ్లతో కొట్టే పరిస్థితి ఎంతో దూరం లేదు అని పవన్ కల్యాణ్ జోస్యం చెప్పారు. జగన్ అనే వ్యక్తి ఆంధ్ర ప్రదేశ్‌కు హానికరం అంటూ పవన్ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments