Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓడిపోతే ఏం చేయాలో ముందే ఆలోచించుకున్నా.. జగన్‌కి అంత టైమిచ్చి చూస్తా... పవన్

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (20:07 IST)
జనసేన పార్టీ వ్యవస్థాపన రోజునాడే పార్టీని ఎలా నడపాలి? ఒకవేళ పరాజయం పాలైతే ఏం చేయాలన్నదానిపై క్లారిటీగా వున్నాన్నారు పవన్ కల్యాణ్. పార్టీ నాయకులతో జనసేనాని మాట్లాడారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉండవల్లిలోని ప్రజావేదికను కూల్చి వేయాలంటూ తీసుకున్న నిర్ణయంపై భిన్నంగా వ్యాఖ్యానించారు.
 
ప్రభుత్వం ప్రజావేదిక ఒక్కదాన్నే కూల్చివేస్తే ప్రజలకు అనుమానం వస్తుందనీ, అలాకాకుండా రాష్ట్రంలో ఎన్ని అక్రమ కట్టడాలున్నాయో వాటన్నిటినీ కూల్చివేస్తే ఎవరకీ ఎలాంటి అనుమానాలు వుండబోవన్నారు. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించిన కట్టడాలను కూల్చివేయడం కరెక్టేననీ, ఈ విషయంలో జగన్ సర్కార్ చిత్తశుద్ధితో చేస్తే తాము కూడా మద్దతిస్తామన్నారు. ఐతే కేవలం ప్రజావేదిక వరకే దాన్ని అమలుచేసి మిగిలినవాటి విషయంలో మీనమేషాలు లెక్కిస్తే ఖచ్చితంగా తాము ప్రశ్నిస్తామన్నారు.
 
జగన్ సర్కార్‌కి 100 రోజులు టైమిస్తామనీ, ఈ కాలంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఆచరణ తీరు గమనిస్తామన్నారు. మంచి నిర్ణయాలు తీసుకుంటే మద్దతిస్తాం... ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తే నిలదీస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments