Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశం పార్టీపై ప్రేమ కాదు.. చంద్రబాబు అంటే గౌరవం : పవన్ కళ్యాణ్

Webdunia
బుధవారం, 15 మార్చి 2023 (10:32 IST)
తాను కమ్మ కులస్తులకు కొమ్ము కాస్తున్నానని, తెలుగుదేశం పార్టీని అందలమెక్కించేందుకు ప్రయత్నిస్తున్నానంటూ వైకాపా మంత్రులు, కొందరు కాపు నేతలు తనను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న ప్రచారానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మచిలీపట్నం వేదికగా సరిగా సమాధానం చెప్పారు. తనకు తెలుగుదేశం పార్టీ అంటే ప్రేమ లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంటే తనకు ఆరాధ్యభావమేదీ లేదన్నారు. ఆయన 14 యేళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేశారని గుర్తుచేశారు. సమర్థుడు కాబట్టే గౌరవిస్తున్నానని చెప్పారు. ఇప్పటి ముఖ్యమంత్రి కూడా రాజ్యాంగ పదవిలో ఉన్నాడు కాబట్టి, ప్రజలు ఓటేసి ఎన్నుకున్నారు కాబట్టి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతుంటానని వివరించారు. 
 
ఇకపొత్తుల గురించి ప్రస్తావిస్తూ, జనసేనకు టీడీపీ కేవలం 20 సీట్లకు మాత్రమే పరిమితం చేసిందంటూ జరుగుతున్న ప్రచారంపై కూడా పవన్ స్పందించారు. చేతులెత్తి మొక్కుతున్నా.. పొత్తుల గురించి తాను ఎక్కడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. చర్చలు జరపలేదన్నారు. వాట్సాప్ సందేశాలు చూసి మీరు నమ్మేస్తే ఎలా అని ప్రశ్నించారు. దశాబ్ద కాలం మీకు అండగా ఉన్నాను.. కనీసం నన్ను నమ్మండి. శంకించకండి అని విజ్ఞప్తి చేశారు. 
 
ఈ దఫా ఎన్నికల్లో జనసేన పార్టీ ఎట్టిపరిస్థితుల్లోనూ బలిపశువు కాబోదన్నారు. పైగా ప్రయోగాలు చేయనని స్పష్టంచేశారు. ఈ సారి గెలిచే విధంగానే ప్రణాళిక ఉంటుదని చెప్పారు. తనతో సహా గెలిచి తీరాలనే బరిలోకి దిగుతున్నామన్నారు. నాతో నడిచేవాడే నా వాడు.. నన్ను శంకించేవాడు నా వాడు కాదు అని స్పష్టం చేశారు. ఈ సారి గెలిచినా తర్వాత ఆవిర్భావ దినోత్సవం జరుపుకుందామని కార్యర్తల్లో ఉత్సాహం కలించే వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓటును వృథా కానివ్వబోనని, జనసైనికులు వచ్చే ఎన్నికల్లో ఏం జరగాలని కోరుకుంటున్నారో అదే జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీది బలమైన సంతకం ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments