Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాకు కావాల్సింది చెత్త కాదు.. అర్హుల‌ైన అనలిస్ట్స్ కావాలి : పవన్ కళ్యాణ్

పార్టీ సేవల కోసం అర్హులను ఎంపిక చేస్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీకాకుళంలో బుధవారం జ‌న‌సేన‌ పార్టీ కోసం ఎంపిక‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ ప్రకటన విడుదల చ

Webdunia
బుధవారం, 17 మే 2017 (16:58 IST)
పార్టీ సేవల కోసం అర్హులను ఎంపిక చేస్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీకాకుళంలో బుధవారం జ‌న‌సేన‌ పార్టీ కోసం ఎంపిక‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేస్తూ ఈ ఎంపిక‌ల్లో యువ‌త ఉత్స‌హంగా పాల్గొంటున్నార‌ని, పార్టీ సేవల కోసం అర్హుల‌ను ఎంపిక చేస్తామ‌న్నారు. త‌మ‌కు అందిన అన్ని ద‌ర‌ఖాస్తుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నామ‌న్నారు. 
 
విజ‌య న‌గ‌రం నుంచి జ‌న‌సేన‌కు మొత్తం 2 వేల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని అన్నారు. ఈ నెల 20, 21న విజ‌యన‌గ‌రంలోనూ జ‌న‌సేన శిబిరం ఉంటుంద‌ని తెలిపారు. కాగా, శ్రీకాకుళం, విశాఖపట్నం, గ్రేటర్ హైదరాబాద్ లలో జనసేన శిబిరాల గురించి పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.  
 
మరోవైపు.. శ్రీ‌కాకుళంలో ఎంపిక‌లు జ‌రుగుతున్నాయి. ద‌ర‌ఖాస్తు చేసుకోలేక‌పోయిన వారు కూడా ఈ ఎంపిక‌ల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ఇవి ఎంట్రెన్స్ టెస్ట్‌లాంటివి కావని, యువ‌తలో ప్ర‌తిభ‌ను గుర్తించేందుకు మాత్ర‌మే ఈ ప్ర‌క్రియ‌ను కొన‌సాగిస్తున్నారు. 
 
ఉత్సాహం, ఆస‌క్తి, సామాజిక సృహ ఉన్న యువ‌త కోసం ఈ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఉత్త‌రాంధ్ర‌లో ఆ పార్టీ యువ‌తను ఎంపిక చేసే ప్ర‌క్రియ‌ను కొన‌సాగిస్తోంది. స్పీకర్స్, అనలిస్ట్స్, కంటెంట్ రైటర్స్‌గా సేవలు అందించడానికి ఉత్తరాంధ్ర నుంచి మొత్తం 6 వేల దరఖాస్తులు రాగా, యువ‌త ఉత్సాహంగా పాల్గొంటున్నార‌ని జ‌న‌సేన పార్టీ మీడియా వ్య‌వ‌హారాల స‌మ‌న్వ‌య క‌ర్త హ‌రిప్ర‌సాద్ అన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments