Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనలోకి పార్టీలోకి 20 మంది ఎమ్మెల్యేలు.. కొత్త తరానికి 60 శాతం సీట్లు

ఆంధ్రప్రదేశ్‌లో 20 మంది ఎమ్మెల్యేలు జనసేనలో చేరేందుకు సిద్ధంగా వున్నారు. వీరు ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ సందర్భంగా అన్నీ కుదిరాక.. మంచి ముహూర్తంలో జనసేనలో చేరే

Webdunia
శనివారం, 25 ఆగస్టు 2018 (11:48 IST)
ఆంధ్రప్రదేశ్‌లో 20 మంది ఎమ్మెల్యేలు జనసేనలో చేరేందుకు సిద్ధంగా వున్నారు. వీరు ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ సందర్భంగా అన్నీ కుదిరాక.. మంచి ముహూర్తంలో జనసేనలో చేరేందుకు వీరంతా సిద్ధమవుతారని టాక్ వస్తోంది. పవన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం తేదీ ఖరారు చేసి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తామని జనసేన రాష్ట్ర కన్వీనర్‌ వి.పార్థసారథి వెల్లడించారు. 
 
శుక్రవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ త్వరలోనే అనేక మంది ముఖ్యులు జనసేనలో చేరబోతున్నారని తెలిపారు. రాష్ట్ర మేనిఫెస్టోతోపాటు 175 నియోజకవర్గాలకు మైక్రో మేనిఫెస్టో రూపొందిస్తామని తెలిపారు. ప్రతి జిల్లాకు 25 మందితో.. తర్వాత నియోజకవర్గాలలో 25మందితో కమిటీలు వేసే ప్రక్రియ మొదలైందని పార్థసారథి వివరించారు. 
 
టికెట్ల కేటీయింపులో మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. వివిధ పార్టీల నుంచి కీలక నేతలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పార్టీలో కొత్త తరానికి 60 శాతం సీట్లు ఇస్తామని చెప్పారు. పాత, కొత్త తరం కలయికలతో పార్టీ సమర్థంగా నడుస్తుందనే నమ్మకం తమకుందని వెల్లడించారు. రాబోయే ఎన్నికల కోసం రాష్ట్రస్థాయి మేనిఫెస్టోతో పాటు ప్రతి నియోజవర్గానికీ మేనిఫెస్టో తయారు చేస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments