Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఏజెన్సీలో గంజాయి నిర్మూల‌న‌... గిరిజ‌నుల్లో ప‌రివ‌ర్త‌న

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (11:01 IST)
పరివర్తన కార్యక్రమం ద్వారా విశాఖపట్నం ఏజెన్సీలో గంజాయి నిర్మూలించాలనే ఉద్దేశంతో పోలీసు, ఎస్.ఈ.బి, ఐటిడిఏ ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో పోలీసులు ప్ర‌త్యేక దాడులు చేస్తున్నారు.  జి.మాడుగుల మండలం బొయితిలి పంచాయితీ, రాచవీధి గ్రామాల్లో 7 బృందాల‌తో 14 కటింగ్ మెషిన్ లు,  100 మంది సిబ్బందితో కలసి సుమారు 85 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేసి కాల్చివేశారు.
 
 
ప్ర‌తిసారి గంజాయి నిర్మూల‌ను అడ్డుప‌డే గ్రామ‌స్తులు, గిరిజ‌నులు ఈసారి ఎటువంటి ప్రతిఘటనకు దిగ‌లేదు. గంజాయి మహమ్మారి వలన జరిగే నష్ఠాలు, కష్ఠాల‌ను అవగాహన చేసుకొని గిరిజనులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గంజాయి పంటను నిర్మూలించడానికి సహకరిస్తున్నారు. రాష్ట్రంలో, దేశంలో ఇటీవ‌ల గంజాయి, మాద‌క ద్ర‌వ్యాల రవాణాపై సాగిన చ‌ర్చ‌, ర‌చ్చ‌ల‌పై గ్రామ‌స్తుల‌కు అధికారులు వివ‌రించారు. గంజాయి వ‌ల్ల యువ‌త నిర్వీర్యం కావడ‌మే కాకుండా, దేశ ప్ర‌గ‌తికి ఇది వినాశ‌న‌మ‌ని తెలిపారు. ఈ మాద‌క ద్ర‌వ్యాల వ‌ల్ల దేశ భ‌ద్ర‌త‌, స‌మ‌గ్ర‌త‌కు కూడా భంగం క‌లుగుతుంద‌ని పోలీసులు గ్రామ‌స్తుల‌కు ప‌రివ‌ర్త‌న కార్య‌క్ర‌మంలో వివ‌రిస్తున్నారు. 


ఈ కార్యక్రమంలో  జెడి ఎస్.ఈ. బి. నరేందర్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ వివేక్, ఎస్.ఈ.బి. ఇన్స్పెక్టర్ కేశవరావు, స్థానిక జి.మాడుగుల ఇన్స్పెక్టర్ సత్యనారాయణ , ఎస్సై శ్రీనివాస్ ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments